AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha train accident: మాకు శాశ్వత పరిష్కారం కావాలి.. పరిహారం కాదు.. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సోనూసూద్

రైలు ప్రమాదం గురించి సోనూ సూద్ మాట్లాడిన మూడు నిమిషాల వీడియోను అతను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు పరిహారం అందుతుంది.. ఆ పరిహారం శాశ్వతం కాదు.. మూడు నాలుగు నెలల్లో పూర్తవుతుంది. ఇంటికి ఆసరాగా నిలిచిన వ్యక్తిని శాశ్వతంగా దూరం చేస్తే...ఇలాంటి కుటుంబాలు ఎప్పటికీ బాగుపడవు..ఇలాంటి కుటుంబాలకు ..

Odisha train accident: మాకు శాశ్వత పరిష్కారం కావాలి..  పరిహారం కాదు.. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సోనూసూద్
Odisha Train Disaster Sonu
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2023 | 9:16 AM

Share

ప్రభుత్వం ఇచ్చిన ఈ తాత్కాలిక ఉపశమనం ద్వారా వచ్చే డబ్బు మూడు నాలుగు నెలల్లో అయిపోతుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే బాధిత కుటుంబాలు మళ్లీ నిస్సహాయ స్థితికి చేరుకుంటాయి. అలా కాకుండా బాధిత కుటుంబాలకు శాశ్వత ఉపశమనం కల్పించడంపై ప్రభుత్వాలు ఆలోచించాలని నటుడు, సామాజిక కార్యకర్త సోనూసూద్ అభిప్రాయపడ్డారు. రైలు ప్రమాదం గురించి సోనూ సూద్ మాట్లాడిన మూడు నిమిషాల వీడియోను అతను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో యావత్ దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. దేశవ్యాప్తంగా భయానక నిశ్శబ్దం ఆవహించింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడిన వ్యక్తుల గురించి, వారి కుటుంబాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఈ ఘటనను అన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మనమంతా ట్వీట్లు చేసి తమ సంతాపం వ్యక్తం చేస్తున్నాం. నష్టపోయిన వారిపట్ల సానుభూతి చూపిస్తాం. కానీ కొన్ని రోజులకు ఈ విషయాన్ని మనం మర్చిపోతాం.. మన పనుల్లో బిజీ అయిపోతాం.. గతంలో ఎన్నో ప్రమాధాల విషయంలో ఇలానేజరిగింది. కానీ, ఆ తరువాత వారి జీవితం ఏంటీ అనేది ఎవరూ పట్టించుకోరు. కానీ వీరిలో జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలను పోషించలేని వారి పరిస్థితి ఏంటి..? ఈ ప్రమాదం వల్ల చాలా కుటుంబాలు నష్టపోయాయి. ఆ కుటుంబాలు మళ్ళీ నిలబడతాయా అని ప్రశ్నించారు. ప్రస్తుతం సోనూసూద్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన నష్టపరిహారం తాత్కాలిక ఉపశమనం మాత్రమే.. కాని ఆ పరిహారం రెండు మూడు నెలల్లో అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వారి పరిస్థితి ఏంటి? ఈ ప్రమాదంలో తమ కుటుంబాన్ని పోషించే వారి కాళ్ళు, చేతులు తెగిపోయాయి. అనేక మంది మృత్యువాతపడ్డారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వాలు ఇచ్చే నష్టపరిహారంతో వారికి న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు సోనూ.. అంతే కాదు ఇలాంటి వాటికి మంచి పరిష్కారాలు కావాలి అన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏదో నష్ట పరిహారం చెల్లించి వదిలేయకుండా వారికి పెన్షన్స్ కానీ, స్థిరాదాయం కల్పించడం కానీ చేస్తేనే వారికి భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతామని నా అభిప్రాయం అని సలహా ఇచ్చారు సోనూ.

ఇవి కూడా చదవండి

రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మానేసి బాధితులను ఆదుకోవాలి. సోషల్ మీడియాలో సానుభూతి చెప్పుకునే బదులు అందరం కలిసి నష్టపోయిన కుటుంబాలను ఆదుకుందాం అంటూ ట్విట్టర్‌ వేదికగా సోనూసూద్‌ పిలుపునిచ్చారు. సోనూ ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..