Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala High Court: నగ్నత్వం, అశ్లీలత కాదు.. ఆమె శరీరంపై ఆమెకు హక్కుండాలన్న కేరళ కోర్టు..

స్త్రీ శరీరాల గురించి, తన పిల్లల లైంగిక విద్య కోసం పితృస్వామ్య భావనలను సవాలు చేసేందుకే తాను వీడియో తీశానని తల్లి వివరణను కూడా కోర్టు గుర్తించింది. వీడియోను అశ్లీలంగా పరిగణించలేమని కోర్టు తేల్చిచెప్పింది.అడ్డుకోవడం వల్ల మహిళలకు తమ సొంత శరీరాలపైనే హక్కు లేకుండా పోతోందని హైకోర్టు కామెంట్ చేసింది.

Kerala High Court: నగ్నత్వం, అశ్లీలత కాదు.. ఆమె శరీరంపై ఆమెకు హక్కుండాలన్న కేరళ కోర్టు..
Rehana Fathima
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 06, 2023 | 9:13 AM

ఒక మహిళ నగ్న శరీరంను ఎల్లప్పుడూ లైంగికంగా లేదా అశ్లీల దృష్టితో చూడకూడదని.. తన పిల్లలు సెమీ నగ్నంగా పెయింటింగ్‌ను చిత్రీకరించినందుకు ఒక మహిళను క్రిమినల్ కేసు పెట్టడం సరికాదని.. వెంటనే కేసులను ఎత్తివేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. స్త్రీ శరీరాల గురించి, తన పిల్లల లైంగిక విద్య కోసం పితృస్వామ్య భావనలను సవాలు చేసేందుకే తాను వీడియో తీశానని తల్లి వివరణను కూడా కోర్టు గుర్తించింది. వీడియోను అశ్లీలంగా పరిగణించలేమని కోర్టు తేల్చిచెప్పింది.అడ్డుకోవడం వల్ల మహిళలకు తమ సొంత శరీరాలపైనే హక్కు లేకుండా పోతోందని హైకోర్టు కామెంట్ చేసింది. తమ శరీరానికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా స్వతంత్రంగా తీసుకునే హక్కు ప్రతి  మహిళకు ఉందని స్పష్టం చేసింది. అలా ఉండటం వారికి రాజ్యాంగం 21వ అధికరణ కింద లభించిన వ్యక్తిగత స్వేచ్ఛ పరిధిలోకి వస్తుందని తేల్చి చెప్పింది. అంతేకాదు, నగ్నత్వం, అశ్లీలత పర్యాయపదాలు కావని కూడా కామెంట్ చేసింది.

కేరళకు చెందిన మహిళ మోడల్ రెహనా ఫాతిమా(33) తన శరీరంపై మైనర్ బాలుడితో పెయింటింగ్ వేయించుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మైనర్ పిల్లలు తన సెమీ న్యూడ్ బాడీపై పెయింటింగ్ వేస్తున్న వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసిన ఘటన పోలీసులు కేసు పెట్టారు. పిల్లలతో ఇలాంటి పనులు చేయడం నేరమని అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ ఘటన పై పోక్సో, జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాల కింద నమోదైన కేసుల విచారణలో భాగంగా జస్టిస్‌ కౌసర్‌ ఎడప్పగత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుల విచారణ నుంచి ఆమెకు ఊరటనిచ్చారు. రెహనా ఫాతిమా కొన్నాళ్ల క్రితం సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. అందులో ఆమె పడుకుని ఉండగా.. అర్ధనగ్న శరీరంపై ఆమె కుమారుడు, కుమార్తె ఆమె ఒంటిపై పెయింటింగ్‌ వేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

ఈ వీడియోపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదేంటి అని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులు కూడా దాఖలయ్యాయి. ఆయా కేసుల నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ ఆమె ట్రయల్‌ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. దీంతో ఆమె హైకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు.. ఆమె తన శరీరాన్ని తన పిల్లల కాన్వాసలా ఉపయోగించుకోనిచ్చింది.

తప్ప తన లైంగిక ఉద్రేకాలను తృప్తిపరచుకోవడానికి తన పిల్లలను ఉపయోగించుకున్నట్టు భావించకూడదని అందులో పేర్కొంది. పురుషుడి శరీరంలో పైభాగం నగ్నంగా ఉన్నా దాన్ని లైంగిక దృష్టితో చూడని సమాజం.. మహిళ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని, ఆ భావనను ధిక్కరించేందుకే తాను ఆ బాడీ పెయింటింగ్‌ వీడియో పెట్టానంటూ రెహనా ఫాతిమా ఇచ్చిన వివరణతో కోర్టు ఏకీభవించింది.

Rehana Fathima In Soup Over

Rehana Fathima In Soup Over

మరిన్ని జాతీయ వార్తల కోసం