Bank of Baroda: సూపర్ ప్లాన్‌తో వచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఇకనుంచి ఏటీయంలో ఇలా కూడా డబ్బులు తీసుకోవచ్చు

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏటీయం కేంద్రాల్లో యూపీఐ ద్వారా డబ్బులు తీసుకొనే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి ఇంటరాపరేబుల్ కార్ట్‌లెస్ క్యాష్ విత్‌డ్రా సదుపాయాన్ని(ICCW) తీసుకొచ్చింది.

Bank of Baroda: సూపర్ ప్లాన్‌తో వచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఇకనుంచి ఏటీయంలో ఇలా కూడా డబ్బులు తీసుకోవచ్చు
Bank of Baroda
Follow us
Aravind B

|

Updated on: Jun 06, 2023 | 10:35 AM

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏటీయం కేంద్రాల్లో యూపీఐ ద్వారా డబ్బులు తీసుకొనే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి ఇంటరాపరేబుల్ కార్ట్‌లెస్ క్యాష్ విత్‌డ్రా సదుపాయాన్ని(ICCW) తీసుకొచ్చింది. ఈ సౌకర్యం ద్వారా వినియోగదారులు ఇకనుంచి ఏటీయం నుంచే యూపీఐతో డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.  అయితే యూపీఐ ద్వారా క్యాష్‌ విత్‌ డ్రా చేసుకొనే సదుపాయాన్ని కల్పించిన తొలి ప్రభుత్వరంగ బ్యాంక్‌ తమదేనని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రకటించింది. ఇతర బ్యాంకుల వినియోగదారులు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ఏటీఎం కేంద్రాల్లో మొదటగా ‘క్యాష్‌ విత్‌డ్రా’ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవాలి.

ఆ తర్వాత అక్కడ కనిపించే క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్‌ నుంచి ఏదైనా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంల ద్వారా స్కాన్‌ చేసి క్యాష్‌ మొత్తం, పిన్‌ ఎంటర్‌ చేసి లావాదేవీని పూర్తి చేయొచ్చు. ఒకవేళ యూపీఐ ఐడీతో ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్‌ ఖాతాలు లింకై ఉంటే ఏ బ్యాంక్‌ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవాలని అనేది కస్టమర్‌ ఎంచుకోవచ్చు. అయితే రోజుకు రెండుసార్లు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి వీలుంటుందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పేర్కొంది. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.5 వేలు వరకు విత్‌ డ్రా చేయొచ్చు. మరో విషయం ఏంటంటే ఈ సదుపాయాన్ని అన్ని బ్యాంకులూ కూడా గతంలో ఆర్‌బీఐ ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..