మరి ఇంత దారుణమా.. గేట్ ఆలస్యంగా తీసినందుకు హత్య చేశారు..
కర్ణాటకలో దారుణం వెలుగుచూసింది. గేటు ఆలస్యంగా తీసినందుకు ఓ టోల్ గేట్ ఉద్యోగిని హత్య చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళ్తే బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలో రామనగర సమీపంలోని బిడది అనే ప్రాంతలో ఉన్న టోల్‌ప్లాజా ఉంది.
కర్ణాటకలో దారుణం వెలుగుచూసింది. గేటు ఆలస్యంగా తీసినందుకు ఓ టోల్ గేట్ ఉద్యోగిని హత్య చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళ్తే బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలో రామనగర సమీపంలోని బిడది అనే ప్రాంతలో ఉన్న టోల్‌ప్లాజా ఉంది. ఇక్కడ పవన్ కుమార్ (26)తో అనే వ్యక్తితో పాటు అతని సహచరుడు విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ సమయంలోనే నలుగురు వ్యక్తులు కారులో మైసూరుకు వెళ్తున్నారు. వారు ఆ టోల్‌గేట్ వద్దకు రాగానే.. గేటు త్వరగా తీయాలంటూ సిబ్బందితో గొడవ పడ్డారు.
ఇది కాస్త ఘర్షణకు దారి తీసింది. ఇది చూసిన స్థానికులు వారికి సర్దిచెప్పడంతో గొడవను ఆపేశారు. కానీ ఆ నలుగురు వ్యక్తలు కారును కొంతదూరం నడిపి.. అక్కడ ఆగిపోయారు. టోల్‌ప్లాజాలో పనిచేస్తు్న్న పవన్ పవన్, అతని సహచరుడు భోజనం కోసం టోల్‌గేట్ బయటకు వచ్చారు. ఇది గమనించిన ఆ వ్యక్తులు.. వారిపై కర్రలతో దాడి చేసి పారిపోయారు. ఈ ఘటనలో పవన్ కుమార్ చనిపోగా.. అతని సహచరుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆ నలుగురు నిందితులు బెంగళూరు వాసులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..