ఆర్టీసీ డ్రైవర్ భావోద్వేగం.. బస్సును హగ్ చేసుకొని కన్నీటి పర్యంతం..
తన ఉద్యోగానికి వీడ్కోలు పలికే వేళ ఓ ఆర్టీసీ డ్రైవర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్లు ఆ బస్సుతో పెనవేసుకున్న బంధాన్ని తలచుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన డ్రైవర్ ముత్తుపండి..
తన ఉద్యోగానికి వీడ్కోలు పలికే వేళ ఓ ఆర్టీసీ డ్రైవర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్లు ఆ బస్సుతో పెనవేసుకున్న బంధాన్ని తలచుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన డ్రైవర్ ముత్తుపండి, పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా చివరిసారిగా బస్సును చూసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ డ్రైవర్ భావోద్వేగం అందరి మనసులను కదిలిస్తోంది. డ్రైవర్ ముత్తుపండి తన ఉద్యోగంలో చివరి రోజున ప్రతిరోజూ తాను ఎంతో ఇష్టంగా నడిపే బస్సు స్టీరింగ్ ను ముద్దాడి, క్లచ్, గేర్, బ్రేక్.. ఇలా అన్నింటినీ తడుముతూ, వాటికి నమస్కారం చేస్తూ వదలలేక బరువెక్కిన మనస్సుతో బస్సులోంచి కిందికి దిగారు. ఫుట్ బోర్డుకు నమస్కరించి, బస్సు ముందుకు వచ్చి బస్సును హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. నేటితో తమ బంధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇదంతా తోటి ఉద్యోగులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో కదిలిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆరో ఫ్లోర్ నుంచి కారుపై పడిన పిల్లి !! ఆ పై ఏమైందంటే ??
TOP 9 ET News: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న భోళా శంకర్ | ఆదిపురుపుడి కోసం తీవ్ర పోటీ
Bhola shankar: 24గంటల్లో 10 మిలియన్లు.. అది బాస్ రేంజ్
చెర్రీ, తారక్‌కు స్పైడర్ మ్యాన్ ఫిదా
Dil Raju: ఆదిపురుష్ విషయంలో దిల్ రాజు ఎందుకలా చేశారు ??
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..

