AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: భలే టైమ్‌పాస్‌ గురూ.. ఆడవాళ్లా మజాకా..! మెట్రోలో మహిళల డిష్యూం డిష్యూం..

ఇద్దరు స్త్రీలు ఒకరినొకరు అవమానకరమైన పదాలతో దుర్భాషలాడుకుంటున్నారు. దీంతో ఆగ్రహించిన ఒక మహిళ తన వాటర్‌ బాటిల్‌ను తీసుకుని అవతలి మహిళపై నీళ్లు పోయడంతో పరిస్థితి మరింత విషమించింది. దీంతో మెట్రోలోని ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని పరిస్థితిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే వీరి పోరాటం ఆగేలా కనిపించడం లేదు.

Watch: భలే టైమ్‌పాస్‌ గురూ.. ఆడవాళ్లా మజాకా..! మెట్రోలో మహిళల డిష్యూం డిష్యూం..
Delhi Metro Girl Fight
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2023 | 11:57 AM

Share

చెప్పులు, షూస్‌ కూడా ఫైటింగ్‌ చేసుకునే వారికి ఆయుధాలుగా మారుతుంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లు కొట్టుకునే వీడియోలు అనేకం ఫన్నీగా ఉంటాయి. గతంలో మహిళలు వీడి కుళాయిలు, సినిమా థియేటర్ల వద్ద, ఇంట్లో అత్తా కోడళ్లకు సంబంధించిన విషయాల్లో గొడవలు, కొట్టుకోవటం తరచూ చూస్తుంటాం. అయితే, ఇటీవల మెట్రోలోనూ, బస్సులోనూ సీట్ల కోసం మహిళలు కొట్టుకునే వీడియో కూడా వైరల్‌గా మారటం చూశాం. అయితే, తాజాగా అలాంటిదే ఇద్దరు యువతుల మధ్య సిగపట్టకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఇద్దరు యువతుల గొడవ కారణంగా ఢిల్లీ మెట్రోలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు తన మొబైల్ కెమెరాలో బంధించాడు. అనంతరం సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయటంతో ఘటన వైరల్‌గా మారింది. దీనికి కారణం ఈ వీడియోలో కనిపిస్తున్న యువతుల మధ్య పోట్లాటే ఇందుకు కారణం. ఇద్దరు గుర్తు తెలియని యువతులు మెట్రో లోపల చెప్పులు, బాటిళ్లతో రెచ్చిపోయి కొట్టుకుంటున్నారు.

వీడియోలో కనిపిస్తున్నట్లుగా , ఇద్దరు యువతుల మధ్య గొడవ కారణంగా ఢిల్లీ మెట్రోలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొదట మెట్రోలో ఎక్కిన ఇద్దరు యువతులు దూరంగా నిలబడి ఉన్నారు. కానీ, ఇద్దరూ ఒకరినొకరు అభ్యంతరకరమైన భాషలో దూషించుకోవడం కనిపించింది. అందులో, ఎరుపు రంగు దుస్తులు ధరించిన యువతి తన షూ తీసి తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నల్లటి దుస్తులు ధరించిన మహిళను బెదిరించడం కనిపించింది. దానికి సమాధానంగా యువతి చేతిలోని బాటిల్ పట్టుకుని ఆమెకు ఎదురుగా వెళుతుంది. దీంతో మెట్రోలోని ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని పరిస్థితిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే వీరి పోరాటం ఆగేలా కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి

వీడియో తరువాతి భాగంలో, నల్ల దుస్తులు ధరించిన ఒక మహిళ మెట్రో అధికారిని సంప్రదించడానికి ఫోన్ చేస్తున్నట్టుగా కనిపించింది. అదే సమయంలో మరో వ్యక్తి ఏదో అనడంతో ఆగ్రహానికి గురైన ఆమె తన బాటిల్‌లోని నీళ్లను ఆమెపై పోసింది. ఇద్దరు స్త్రీలు ఒకరినొకరు అవమానకరమైన పదాలతో దుర్భాషలాడుకుంటున్నారు. దీంతో ఆగ్రహించిన ఒక మహిళ తన వాటర్‌ బాటిల్‌ను తీసుకుని అవతలి మహిళపై నీళ్లు పోయడంతో పరిస్థితి మరింత విషమించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో రకరకాల కామెంట్స్‌ వచ్చాయి. ఇది పార్ట్ వన్, పార్ట్ 2 ఇంకా రావాల్సి ఉంది. అంటూ కామెంట్‌ చేశారు. ఇది మాంచి మసాలా తరహా సినిమాలా అనిపిస్తోంది అని మరొకరు రాశారు. మగవారి కంటే ఆడవారి పోరాటాలు చూడటానికే మేలు’’ అంటూ కొందరు చమత్కారంగా రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..