Watch: ప్రేమకు ప్రతిరూపం.. పెంపుడు కుక్కకు గోరుముద్దలు పెడుతున్న అమ్మ…

మూగ జంతువులపై ఇంతటి ప్రేమను కురిపించటం చాలా అరుదుగా కనిపిస్తుందంటూ పలువురు నెటిజన్లు స్పందించారు. ప్రేమకు పరిమితి లేదంటూ కొందరు చెబుతుండగా, మరొకరు.. మా అమ్మ కూడా నా కుక్కకు ఇలాగే తినిపిస్తుందంటూ రాశారు.

Watch: ప్రేమకు ప్రతిరూపం.. పెంపుడు కుక్కకు గోరుముద్దలు పెడుతున్న అమ్మ...
Women Feeding Dog
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 06, 2023 | 11:14 AM

పెంపుడు జంతువులలో కుక్కలు మనుషులకు అత్యంత ఇష్టమైనవి. చాలా ఇళ్లలో వాటిని తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తారు. విశేషమేమిటంటే కుక్కల కంటే విశ్వాసపాత్రమైన జంతువు మరొకటి లేదు. దీనికి మీరు చాలా ఉదాహరణలు చూసి ఉంటారు. ఒకరి ఇంట్లో కుక్కను పెంంచుకున్నట్లయితే, అది కుటుంబంలోని ప్రతి సభ్యుని పట్ల శ్రద్ధ, ప్రేమను చూపుతుంది. ఒకసారి తెలిసిన వారు.. నెలరోజుల తర్వాత ఇంటికి తిరిగివస్తే కూడా మునుపటిలానే ప్రవర్తిస్తుంది.. మనిషికి కుక్కల మధ్య సంబంధం చాలా విలువైనది. పెంపుడు కుక్క, అతని యజమానురాలు మధ్య అందమైన ప్రేమకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ పెంపుడు కుక్క ఒక మహిళ ఆహారం తినిపిస్తున్న విధానం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ మహిళ తమ కుక్కకు చిన్నపిల్లాడికి తినిపిస్తున్నట్టుగానే చేతితో కలిపి గోరు ముద్దలు పెడుతోంది.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఉజ్వల్ అథర్వ @Ujjawal_athrav అనే ఖాతద్వారా షేర్‌ చేశారు. దీనిని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. జూన్ 3న పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే రెండు లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అదే సమయంలో వేల సంఖ్యలో లైకులు కూడా వచ్చాయి.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ..పాత్రలో అన్నం పెట్టుకుని ఉంది. పిల్లలకు ఏ విధంగా అయితే, అన్నం తినిపిస్తారో.. అచ్చం అలాగే గోరుముద్దలు కలిపి వారి పెంపుడు కుక్క నోటిలో ప్రేమగా పెడుతోంది. తల్లి తన చిన్న బిడ్డను ఒడిలో కూర్చొబెట్టుకుని తినిపించినట్లే కుక్కకు కూడా పెడుతుంది. ఆ శునకం కూడా అమ్మ చేతితో పెట్టిన ఆహారాన్ని హాయిగా ఎంజాయ్‌ చేస్తూ తింటోంది. ఈ మనోహరమైన దృశ్యాన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మూగ జంతువులపై ఇంతటి ప్రేమను కురిపించటం చాలా అరుదుగా కనిపిస్తుందంటూ పలువురు నెటిజన్లు స్పందించారు. ప్రేమకు పరిమితి లేదంటూ కొందరు చెబుతుండగా, మరొకరు.. మా అమ్మ కూడా నా కుక్కకు ఇలాగే తినిపిస్తుందంటూ రాశారు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం..