Telangana: భర్త అంటే ఎంత ప్రేమో.. భర్త నాటిన చెట్టుకు దుస్తులు తొడిగి జయంతి వేడుక

వైవాహిక జీవితం సాగిపోతున్న సమయంలో విధి నేను ఉన్నానంటూ మృత్యు రూపంలో భార్య భర్తలను విడదీస్తుంది. ప్రాణానికి ప్రాణమైన జీవిత భాగస్వామి మరణాన్ని తట్టులేకపోతారు. తమ జీవిత భాగస్వామిని తలచుకుంటూ జ్ఞాపకాలతో మందుకు సాగుతారు. తాజాగా ఓ భార్య మరణించిన భర్తను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని విభిన్న పద్దతిలో జరుపుకుంది. ఈ ఘటన తెలంగాణాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.

Telangana:  భర్త అంటే ఎంత ప్రేమో.. భర్త నాటిన చెట్టుకు దుస్తులు తొడిగి జయంతి వేడుక
Husband Birthday With The Tree
Follow us
Surya Kala

|

Updated on: Aug 01, 2024 | 7:56 AM

భార్యాభర్తల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. పెళ్లి అనే బంధంతో ఇద్దరు మనుషులు ఒక్కటవుతారు. తన కోసం కన్నవారిని, రక్త సంబంధాన్ని వదిలి తన ఇంటికి వచ్చిన భార్యని కంటికి పాపలా కాపాడతాడు భర్త. నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని భార్యాభర్తలు కోరుకుంటారు. జీవితాంతం కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడునీడగా జీవిస్తారు. కొంతమంది భర్తలు అయితే భార్య ముందు ఒక చిన్న పిల్లాడే.. ఒకరినొకరు వదిలి క్షణం కూడా ఉండలేరు. చివరకు భర్తను వదిలి పుట్టింటికి వెళ్ళడానికి కూడా కొంతమంది భార్యలు ఆలోచిస్తారు. అంతగా భార్యాభర్తలు మద్య ప్రేమ బంధం ఉంటుంది. అయితే ఇలా సంతోషంగా వైవాహిక జీవితం సాగిపోతున్న సమయంలో విధి నేను ఉన్నానంటూ మృత్యు రూపంలో భార్య భర్తలను విడదీస్తుంది. ప్రాణానికి ప్రాణమైన జీవిత భాగస్వామి మరణాన్ని తట్టులేకపోతారు. తమ జీవిత భాగస్వామిని తలచుకుంటూ జ్ఞాపకాలతో మందుకు సాగుతారు. తాజాగా ఓ భార్య మరణించిన భర్తను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని విభిన్న పద్దతిలో జరుపుకుంది. ఈ ఘటన తెలంగాణాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.

వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ కోట్రిక విజయలక్ష్మి భర్త వెంకటయ్య అనారోగ్యంతో ఉన్న సమయంలో తన ఇంటి ఎదుట మొక్క నాటారు. అయితే వెంకటయ్య కొంత కాలం క్రితం మరణించాడు. అప్పటి నుంచి విజయలక్ష్మి తన భర్త జ్ఞాపకంగా ఆ మొక్కను జాగ్రత్తగా పెంచుకుంటుంది. ఇప్పుడు ఆ మొక్క చెట్టుగా ఎదిగింది. అంతేకాదు ప్రతి సంవత్సరం కుటుంబసభ్యులతో కలిసి భర్త జయంతి సందర్భంగా ఆ చెట్టుని అలంకరించి జరుపుకుంటుంది. బెలున్స్ కట్టి భర్త దుస్తులను ఆ చెట్టుకు వేసి వేడుకలను నిర్వహిస్తుంది. అయితే జాతీయ రహదారి వెడల్పు చేసే సమయంలో విజయలక్ష్మి ఇంటి ముందు ఉన్న చెట్టుని తొలగించాల్సి వచ్చింది. అప్పుడు విజయలక్ష్మి అధికారులకు విజ్ఞప్తి చేసి వ్యవసాయ శాస్త్రవేత్తల అనుమతితో భర్త నాటిన చెట్టుని జేసిబీ సహాయంతో తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రానికి తీసుకుని వెళ్లి అక్కడ నాటారు. అప్పటి నుంచి ఆ చెట్టుని ప్రేమగా పెంచుతూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా భార్య వెంకటయ్య జయంతి వేడుకలను తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో చెట్టుకు భర్త డ్రెస్‌ వేసి వినూత్నంగా చెట్టుకు పుట్టినరోజు, భర్తకు జయంతిని నిర్వహించింది. ఆ చెట్టుకు పూజలు చేసి.. పంచభక్ష పరమాన్నాలు పెట్టి వేడుకను ఘనంగా నిర్వహించింది

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..