AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Tarun – Lavanya: రాజ్‌తరుణ్ ఎక్కడున్నా రావాలి.. డైరెక్ట్‌గా ఇంటికెళ్లి రచ్చ చేసిన లావణ్య.. వీడియో..

రాజ్‌ తరుణ్ ప్రేయసి లావణ్య మరోసారి ఆందోళనకు దిగింది. మొదట ప్రసాద్‌ ల్యాబ్స్‌ దగ్గర హడావుడి చేసిన లావణ్య .. తర్వాత మాదాపూర్‌లోని రాజ్‌ తరుణ్‌ ఇంటి దగ్గర నిరసనకు దిగింది. రాజ్‌ తరుణ్ కోసం ఎందాకైనా పోరాడతానని స్పష్టం చేసింది. బుధవారం ఉదయం ప్రసాద్‌ ల్యాబ్ దగ్గర హడావుడి చేసిన రాజ్‌ తరుణ్‌ ప్రేయసి లావణ్య.. తన భర్త తనకు కావాలన్నారు.

Raj Tarun - Lavanya: రాజ్‌తరుణ్ ఎక్కడున్నా రావాలి.. డైరెక్ట్‌గా ఇంటికెళ్లి రచ్చ చేసిన లావణ్య.. వీడియో..
Raj Tarun Lavanya
Shaik Madar Saheb
|

Updated on: Aug 01, 2024 | 7:42 AM

Share

రాజ్‌ తరుణ్ ప్రేయసి లావణ్య మరోసారి ఆందోళనకు దిగింది. మొదట ప్రసాద్‌ ల్యాబ్స్‌ దగ్గర హడావుడి చేసిన లావణ్య .. తర్వాత మాదాపూర్‌లోని రాజ్‌ తరుణ్‌ ఇంటి దగ్గర నిరసనకు దిగింది. రాజ్‌ తరుణ్ కోసం ఎందాకైనా పోరాడతానని స్పష్టం చేసింది. బుధవారం ఉదయం ప్రసాద్‌ ల్యాబ్ దగ్గర హడావుడి చేసిన రాజ్‌ తరుణ్‌ ప్రేయసి లావణ్య.. తన భర్త తనకు కావాలన్నారు. కొందరు వ్యక్తులు అతడిని కలవనీయకుండా అడ్డుకుంటున్నారని లావణ్య ఆరోపించింది. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో తిరగబడరసామీ ప్రీరిలీజ్‌వేడుక జరిగింది. రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్ర సహా చిత్ర బృందం ఈ ఈవెంట్‌లో పాల్గొంది. పంక్షన్ జరిగే ప్రసాద్ ల్యాబ్‌ దగ్గరకు వెళ్లిన లావణ్యను పోలీసులు అడ్డుకున్నారు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకుని వెళ్లిపోతున్నాడో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది లావణ్య. రాజ్ తరుణ్ కోసం ఎందాకైనా వెళ్తానన్నారు.

ఆ తర్వాత రాజ్‌ తరుణ్ ఇంటి వద్దకు కూడా వెళ్లి ఆందోళనకు దిగింది లావణ్య. ఇంటి తలుపులు తీయాలని నిరసన చేపట్టింది. తనకు న్యాయం చేయాలని రాజ్‌తరుణ్ తల్లిదండ్రులను కోరింది. ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌పై ఆధారాలతో వెళ్లిన లావణ్య.. రాజ్‌తరుణ్ ఎక్కడున్నా రావాలని డిమాండ్ చేసింది. తాను కలిసేందుకు వెళ్తే ప్రసాద్ ల్యాబ్ నుంచి రాజ్ తరుణ్ తప్పించుకొని వెళ్లిపోయాడని లావణ్య పేర్కొంది.

వీడియో చూడండి..

ఇదిలాఉంటే.. తాను లావణ్య విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చానన్నారు నటుడు రాజ్‌ తరుణ్. ప్రతి దానికి తన దగ్గర ప్రూఫ్ ఉందన్నారు. లీగల్ గా ప్రొసీడ్ అవుతానని చెప్పారు. తాను ఈ విషయంలో ఏ తప్పు చేయలేదన్నారు. పోలీసుల నోటీసులకు సమాధానం ఇచ్చానన్నారు. తన అమాయకత్వాన్ని.. మంచి తనాన్ని ఆసరాగా తీసుకొని నిందలు వేయడం కరెక్ట్ కాదన్నారు. ఈ వివాదాలు పక్కనపెట్టేసి మాల్వీ మల్హోత్రను ఆశీర్వదించాలని ప్రీరీలీజ్ వేడుకలో అభ్యర్థించారు రాజ్‌ తరుణ్.

కాగా.. రాజ్‌తరుణ్‌ తనను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మోసం చేశాడంటూ రెండు వారాల క్రితం పోలీసులను ఆశ్రయించింది లావణ్య. హీరోయిన్ మాల్వీ మల్హోత్ర కోసం తనను దూరం పెడుతున్నాడంటూ ఫిర్యాదు చేసింది. మరోవైపు హీరోయిన్ మాల్వీ సైతం లావణ్యపై కేసు పెట్టింది. తనకు న్యాయం చేయాలని రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న లావణ్య తాజాగా రాజ్‌తరుణ్ ఇంటికి వెళ్లి నిరనస చేపట్టడం సంచలనంగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.