BRS Party: త్వరలో ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్.. ఆయన ట్వీట్ వెనుక అంతర్యమిదేనా..?
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి ఆ పార్టీ నాయకుల్లో కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ఆ తరువాత కేసీఆర్ కాలులోని తుంటి ఎముకకి గాయమై బెడ్ రెస్ట్ తీసుకోవడం మరింత భయాన్ని కలిగించింది. ఇదిలా ఉంటే నిన్నటి వరకూ కేసీఆర్ను తీవ్రమైన విమర్శలతో దూషించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసి ముందుకు దూసుకుపోతున్నారు. నిన్న, మొన్నటి వరకూ రాజకీయ శతృవులుగా ఉన్నవాళ్లంతా ఇప్పుడు అధికారంలో మంత్రులుగా కొనసాగుతున్నారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి ఆ పార్టీ నాయకుల్లో కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ఆ తరువాత కేసీఆర్ కాలులోని తుంటి ఎముకకి గాయమై బెడ్ రెస్ట్ తీసుకోవడం మరింత భయాన్ని కలిగించింది. ఇదిలా ఉంటే నిన్నటి వరకూ కేసీఆర్ను తీవ్రమైన విమర్శలతో దూషించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసి ముందుకు దూసుకుపోతున్నారు. నిన్న, మొన్నటి వరకూ రాజకీయ శతృవులుగా ఉన్నవాళ్లంతా ఇప్పుడు అధికారంలో మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే కార్యకర్తల్లో, పార్టీ శ్రేణుల్లో ఎక్కడా నమ్మకం సన్నగిల్లకుండా కేటీఆర్, హరీష్ రావు ఫీల్డ్‌లోకి వచ్చారు. అయినప్పటికీ కేసీఆర్ కనిపిస్తే ఆ పార్టీ నేతల్లో వచ్చే జోష్ వేరు. కానీ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బయటికి రాలేని పరిస్థితి. ఫాం హౌజ్‌లో జారి కిందపడి తుంటికి సర్జరీ అయి దాదాపు నెల రోజుల నుంచి రెస్ట్ తీసుకుంటున్నారు.
అయితే ఇదంతా గతేడాది చివరి నెలలో చోటు చేసుకున్న పరిస్థితులు. కానీ ఇప్పుడు పార్టీ నేతల్లో ధైర్యాన్ని నింపేందుకు.. తెలంగాణలో మరోసారి పట్టు సాధించేందుకు కేసీఆర్ బయటికి వస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పర్యటించబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకటి రెండు కాదు.. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో పబ్లిక్ మీటింగ్‌లు నిర్వహించబోతున్నట్లు సమాచారం. కేసీఆర్ పూర్తిగా కోలుకుని చైర్‌లో కూర్చున్న ఫొటోను.. లీడర్ ఈజ్ బ్యాక్ అంటూ రాజ్యసభ సభ్యులు సంతోష్ తన ఎక్స్ ఖాతాలో (ట్విటర్) పోస్ట్ చేశారు. త్వరలోనే ఆయన ప్రజల మధ్యకు మరోసారి రాబోతున్నారంటూ చెప్పారు. దీంతో పార్టీ నేతల్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది. కొత్త ఏడాది నూతన ఉత్సాహంతో ప్రజల ముందుకు రాబోతున్నట్లు స్పష్టమైది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో రాష్ట్రంలో దాదాపు అంతా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు వాళ్లందరినీ యాక్టివేట్ చేసేందుకు కేసీఆర్ మళ్లీ బయటికి వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. గెలుపు గుర్రాలను బరిలో దింపి.. తెలంగాణలో పట్టుకోల్పోకుండా ఉండేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఉన్న కారణాల్లో అతిపెద్ద కారణం కేసీఆర్ ప్రజల్లోకి రారు అని అపవాదు ఉంది. ఇప్పుడు అలాంటి అపవాదు తమపై రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రజా దర్భార్ పేరుతో ప్రజలతో మమేకం అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే అన్ని జిల్లాల్లో పబ్లిక్ మీటింగ్‌లు పెడుతూ ఇప్పటి నుంచీ కేసీఆర్ ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే కేసీఆర్ మేనియా లోక్ సభ ఎన్నికల్లో ఏమాత్రం పనిచేస్తుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాలి.
The #Leader is back and ready to make waves.#KCR #LeadershipRevived. pic.twitter.com/9YLC7V7qbn
— Santosh Kumar J (@SantoshKumarBRS) January 7, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..