CM Revanth Reddy: తెలంగాణలో ముఖ్యమంత్రిగా నెల రోజుల పాలనపై స్పందించిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి నేటికి సరిగ్గా నెల రోజులైంది. కిందటి నెల ఇదే రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది ప్రజలు హాజరయ్యారు.

CM Revanth Reddy: తెలంగాణలో ముఖ్యమంత్రిగా నెల రోజుల పాలనపై స్పందించిన రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy Tweet
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 07, 2024 | 4:06 PM

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్య బాధ్యతలు నిర్వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరిపాలనపై తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు ఉచిత గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టారు. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి నేటికి సరిగ్గా నెల రోజులైంది. కిందటి నెల ఇదే రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది ప్రజలు హాజరయ్యారు.

తెలంగాణలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించి నెల రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్ ఎక్స్ ద్వారా స్పందించారు. సంకెళ్లు తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్తానం తృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. తాము సేవకులం తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ, పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన ఈ నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతి ఇచ్చిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్.

పేదల గొంతు వింటూ, యువత భవితకు దారులు వేస్తూ, మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖాల్లో ఆనందాలు చూస్తూ, రైతులకు భరోసానిస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు సాగుతోందన్నారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని, పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ, నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ, మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని వివరించారు. రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇకపైనా తన బాధ్యత నిర్వర్తిస్తానని సుదీర్ఘ పోస్టు చేశారు.

మత్తు లేని తెలంగాణ సమాజం కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని పేర్కొన్నారు. రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా ముఖ్యమంత్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.

Revant Tweet

Revanth Reddy Tweet

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…