Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కీలక బాధ్యతలు.. అగ్నిపరీక్ష ముందుందా..?

కర్ణాటక, తెలంగాణలో అధికారంలో దక్కించుకున్న కాంగ్రెస్‌.. సౌత్‌లో మంచి జోష్‌ మీద కనిపిస్తోంది. లోక్‌ సభ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే సాధించాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి ఎండింగ్‌ లేదంటే.. మార్చిలో పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటినుంచే హస్తం పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. లోక్‌సభ ఎన్నికలపై ఇప్పటికే ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కీలక బాధ్యతలు.. అగ్నిపరీక్ష ముందుందా..?
Cm Revanth Reddy
Follow us
Srikar T

|

Updated on: Jan 07, 2024 | 6:20 PM

కర్ణాటక, తెలంగాణలో అధికారంలో దక్కించుకున్న కాంగ్రెస్‌.. సౌత్‌లో మంచి జోష్‌ మీద కనిపిస్తోంది. లోక్‌ సభ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే సాధించాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి ఎండింగ్‌ లేదంటే.. మార్చిలో పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటినుంచే హస్తం పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. లోక్‌సభ ఎన్నికలపై ఇప్పటికే ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మిత్రపక్షాలతో సీట్ల పంపకం కూడా తుది దశకు వచ్చేసింది. లోక్‌ సభ ఎన్నికలకు రాష్ట్రాల వారీగా ఎలక్షన్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా.. తెలంగాణ సీఎం రేవంత్‌కు మరో టాస్క్ ఇచ్చింది కాంగ్రెస్‌. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల బాధ్యతను అప్పజెప్పింది. ప్రదేశ్ ఎలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా రేవంత్‌ను నియమించింది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం సహా.. పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు చోటు కల్పించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ రేవంత్‌పై పూర్తి నమ్మకం ఉంచిన కాంగ్రెస్‌ పార్టీ.. మరోసారి ఆయనపైనే భారం వేసింది. ప్రస్తుతం దక్షిణాదిన కాంగ్రెస్ పూర్తిగా పట్టు సాధించింది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించగా.. తమిళనాడులో మిత్రపక్షం డీఎంకే అధికారంలో ఉంది. కేరళలోనూ కాంగ్రెస్‌కు మంచి ఫలితాలే వస్తాయని ఆశతో ఉన్నారు. ఇక తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 12 స్థానాలు చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగానే రేవంత్‌ రెడ్డికి ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించింది. లోక్‌సభ సభ్యుల ఎంపిక, వారి బలాబలాలు, సామాజిక సమీకరణాలు విశ్లేషించి ఏఐసీసీకి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదిక ఆధారంగానే అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయనుంది. కమిటీలో ఉన్న పలువురు సభ్యులు సైతం లోక్‌సభ టికెట్ రేసులో ఉన్నారు. వీరిలో జానారెడ్డి, బలరాం నాయక్‌, వంశీచంద్ రెడ్డి. అంజన్‌ కుమార్ యాదవ్ లాంటి నేతలు లోక్‌సభ టికెట్ ఆశిస్తున్నారు.

ఐతే లోక్‌సభ ఎన్నికల బాధ్యత తీసుకున్న రేవంత్‌కు.. అసలు సవాళ్లు ఇకపై ఎదురుకాబోతున్నాయా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్‌ చేస్తే.. పార్లమెంట్‌ ఎన్నికలు చాలా డిఫరెంట్‌. జనాల తీరు కూడా వేరేలా ఉంటుంది. అందుకే తీర్పు కూడా అసెంబ్లీకి ఉన్నట్లు ఉండదు. ఢిల్లీ లెవల్‌లో ఆలోచించి జనాలు ఓట్లు వేస్తారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పాగా వేసింది. ఇది చాలు జనాల మూడ్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి! పైగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓటు బ్యాంక్ బీజేపీలో కొత్త జోష్‌ నింపింది. 10 స్థానాల్లో విజయమే టార్గెట్‌గా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇక అటు బీఆర్ఎస్‌ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయింది. ఇలాంటి రాజకీయ పరిస్థితులు, నాయకుల మధ్య గట్టి పోటీ నెలకొన్న తరుణంలో.. కాంగ్రెస్‌కు తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లు గెలిపించడం.. రేవంత్‌కు కచ్చితంగా అతిపెద్ద టాస్క్ గా చెప్పాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..