చిరుత దాడితో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు.. ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేసి సెర్చ్‌ ఆపరేషన్‌

పందలూరు అనే ప్రాంతంలోని టీ ఎస్టేట్‌ దగ్గర చిరుత చేసిన దాడిలో ఒక మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. చిరుత దాడి చేయగానే, నెత్తురోడుతున్న బాలుడిని అక్కడున్నవారు బైక్‌ మీద తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గంలోనే ఆ చిన్నారి చనిపోయాడు. ఈ ఘటన తర్వాత, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నీలగిరి జిల్లా గుడలూర్‌లో స్థానికులు బంద్‌ పాటించారు...

చిరుత దాడితో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు.. ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేసి సెర్చ్‌ ఆపరేషన్‌
Leopard
Follow us
Subhash Goud

|

Updated on: Jan 07, 2024 | 12:19 PM

తమిళనాడులోని నీలగరి జిల్లాలో ఆపరేషన్‌ చిరుత జోరుగా కొనసాగుతోంది. మూడేళ్ల బాలుడిని చంపిన చిరుతను పట్టుకునేందుకు అన్వేషణ చేపడుతున్నారు. చిరుత దాడి చేసిన ప్రాంతంలో అటవీ పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. కాలినడకన కొందరు, గజరాజులపై మరికొందరు చిరుత కోసం వెతుకుతున్నారు. అటవీ బృందాలు ఇప్పటికే బోనును సిద్ధం చేశారు. రక్తం రుచిమరిగిన పులి, మళ్లీ అటుగా వస్తే, బంధిస్తామని ఖాయమని జనానికి భరోసా ఇస్తున్నారు. బాలుడు చనిపోయిన తర్వాత, విమర్శలు రావడంతో, అధికారులు ఇప్పుడు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.

నిన్న పందలూరు అనే ప్రాంతంలోని టీ ఎస్టేట్‌ దగ్గర చిరుత చేసిన దాడిలో ఒక మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. చిరుత దాడి చేయగానే, నెత్తురోడుతున్న బాలుడిని అక్కడున్నవారు బైక్‌ మీద తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గంలోనే ఆ చిన్నారి చనిపోయాడు. ఈ ఘటన తర్వాత, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నీలగిరి జిల్లా గుడలూర్‌లో స్థానికులు బంద్‌ పాటించారు. అక్కడి రోడ్డుమీదకు వచ్చారు. రహదారిని దిగ్బంధం చేశారు. చిరుత దాడిలో బాలుడు చనిపోవడానికి అధికారులే కారణమని జనం ఆరోపిస్తున్నారు. చిరుతపులుల సంచారంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు.

చనిపోయిన మూడేళ్ల చిన్నారి, జార్ఖండ్‌ వలసకూలీల కుటుంబానికి చెందినవాడు. పందలూరు దగ్గరున్న టీ ఎస్టేట్‌లో పనిచేయడానికి జార్ఖండ్‌ నుంచి వలస వచ్చిన కుటుంబం ఇది. ఈ దాడిలో బాలుడి సోదరిని, చిరుత దాడి నుంచి అతడి తల్లి కాపాడింది. ఇలాంటి వలసకూలీలు ఎంతోమంది అక్కడ పనిచేస్తున్నారు. దీంతో వలస కూలీలలు భయపడుతున్నారు. అక్కడ పనిచేయడానికే జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో చిరుతను బంధించడానికి అటవీ శాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి