Viral Video: విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్

మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సునిల్‌ కాంబ్లే విధుల్లో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం పుణె కంటోన్మెంట్‌లోని సస్సూన్‌ జనరల్‌ ఆస్పత్రిలో ఓ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్ వచ్చారు. ఈ కార్యక్రమానికి పూణే కంటోన్మెంట్ నియోజకవర్గానికి..

Viral Video: విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
MLA Seen Slap On-Duty Cop
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 07, 2024 | 11:11 AM

పుణె, జనవరి 7: మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సునిల్‌ కాంబ్లే విధుల్లో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం పుణె కంటోన్మెంట్‌లోని సస్సూన్‌ జనరల్‌ ఆస్పత్రిలో ఓ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్ వచ్చారు.

ఈ కార్యక్రమానికి పూణే కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సునిల్‌ కాంబ్లే కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం మెట్లు దిగి వస్తున్న ఎమ్మెల్యే కాంబ్లేకి కానిస్టేబుల్‌ ఎదురయ్యారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే సునిల్‌ కాంబ్లే కానిస్టేబుల్‌ చెంప చెల్లుమనిపించారు. బాధిత కానిస్టేబుల్‌ బండ్‌గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌గా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. శనివారం బాధిత కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్‌ 353 కింద (ప్రభుత్వ సేవకుడిని తన విధులను నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి చేయడం లేదా క్రిమినల్ ఫోర్స్) కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే విధుల్లో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్నట్లు వస్తున్న వార్తలను ఎమ్మెల్యే ఖండించారు. నేను ఎవరిపైనా దాడి చేయలేదు. మెట్లుదిగి వస్తుండగా అడ్డుగా వచ్చిన ఒక వ్యక్తిని పక్కకు తోసేసి, ముందుకు వెళ్లానని ఎమ్మెల్యే కాంబ్లే ఈ ఘటనపై స్పందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.