MLC Kavitha: ఆ రోజున అందుబాటులో ఉంటా.. సీబీఐ లేఖపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. తెలంగాణ రాజకీయాలను మరింత హీటెక్కిస్తోంది. ఎమ్మెల్సీ కవిత పేరుండటం.. సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. సీబీఐ ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తాను అందుబాటులో ఉండనంటూ కవిత లేఖ రాశారు.

MLC Kavitha: ఆ రోజున అందుబాటులో ఉంటా.. సీబీఐ లేఖపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత..
Mlc Kavitha
Follow us

|

Updated on: Dec 06, 2022 | 8:27 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. తెలంగాణ రాజకీయాలను మరింత హీటెక్కిస్తోంది. ఎమ్మెల్సీ కవిత పేరుండటం.. సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. సీబీఐ ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తాను అందుబాటులో ఉండనంటూ కవిత లేఖ రాశారు. దీనిపై ఉదయం నుంచి సస్పెన్స్ నెలకొనగా.. సాయంత్రం సీబీఐ 11న అందుబాటులో ఉండాలని సూచించింది. ఉదయం 11 గంటల కల్లా హాజరుకావాలని లేఖలో వెల్లడించింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత కూడా రిప్లే ఇచ్చారు. 11న ఉదయం 11గంటలకు అందుబాటులో ఉంటానంటూ కవిత రిప్లేలో వెల్లడించారు. సీబీఐ అధికారులతో సమావేశానికి అంగీకరించడంతో దీనికి తెరపడినట్లయింది. ఈ మేరకు కవిత సీబీఐకి మంగళవారం రాత్రి లేఖ రాశారు.

వాస్తవానికి ఈ రోజునే (డిసెంబర్ 6న) అందుబాటులో ఉండాలంటూ కవితకు సూచించారు అధికారులు. అయితే ముందే ఖరారైన కార్యక్రమాలు ఉండటం వల్ల కుదరంటూ రిప్లై పంపారు కవిత.ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో.. అందుబాటులో ఉంటానని చెప్పారు. సీబీఐ నుంచి సమాధానం రాకపోవడంతో టెన్షన్‌ సిట్యుయేషన్ నెలకొంది. వాస్తవానికి ఉదయమే జగిత్యాలకు వెళ్లాలనుకున్నారు కవిత. కానీ CBI రిప్లై రాకపోవడంతో ఇంట్లోనే వేచిచూశారు..! చివరికి సాయంత్రం 5 తర్వాత ఈ-మెయిల్ ద్వారా రిప్లై పంపింది కేంద్రదర్యాప్తు సంస్థ.

లిక్కర్ స్కామ్‌లో వాంగ్మూలం ఇవ్వలంటూ CRPC 160 కింద కవితకు నోటీసులు పంపింది CBI. కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేసిన కాపీతో పాటు.. FIR కాపీని పంపాలంటూ లేఖ రాశారు కవిత. FIR కాపీ CBI వెబ్‌సైట్‌లో ఉందని పరిశీలించవచ్చని అటు నుంచి సమాధానం వచ్చింది. FIRను క్షుణ్ణంగా పరిశీలించాను… అందులో ఎక్కడా తన పేరు లేదని ..ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల మంగళవారం అందుబాటులో ఉండలేనని మళ్లీ లేఖ రాశారు కవిత. ఈనెల 11, 12, 14, 15వ తేదీల్లో.. అందుబాటులో ఉంటాను. దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పారు. ఏదో ఒక డేట్‌ను ఖరారు చేయాలని కోరారు. దీనికే ఇప్పుడు CBI సమాధానం పంపింది. మొత్తానికి పలు ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత డేట్‌, టైమ్ ఫిక్సైంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ లిక్కర్ స్కాం ఓ సంచలనం. కుంభకోణం ఢిల్లీ కేంద్రంగా జరిగినా.. తెలుగు రాష్ట్రాలకూ లింకులున్నట్లు తేలడం.. ఇప్పటికే CBI, ED పలువురిని అరెస్ట్ చేయడం జరిగిపోయాయి. ఇక ఈ కేసు పొలిటికల్ టర్న్ కూడా తీసుకోవడంతో హైవోల్టేజ్ హీట్‌ రాజుకుంది. ఇదే స్కామ్‌లో అమిత్‌ అరోరాపై వేసిన రిమాండ్‌ రిపోర్ట్‌లో కవిత పేరుని ప్రస్తావించింది ఈడీ. పలు ఫోన్లు ధ్వంసం చేసినట్లు కూడా ఆరోపించింది. ఆ వెంటనే CBI సెక్షన్‌ 160 కింత నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు కవిత స్టేట్‌మెంట్‌ తీసుకునేందుకు CBI హైదరాబాద్‌ రానుండటం ఆసక్తికరంగా మారింది.

పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..