YS Sharmila: డ్రామాలు ఆడుతున్నారు.. వారందరికీ ఆస్కార్ ఇవ్వాలి.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు..

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల కాన్వాయ్ పై దాడి, అరెస్టులు.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రుల తీరుపై..

YS Sharmila: డ్రామాలు ఆడుతున్నారు.. వారందరికీ ఆస్కార్ ఇవ్వాలి.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు..
Ys Sharmila
Follow us

|

Updated on: Dec 06, 2022 | 7:25 PM

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల కాన్వాయ్ పై దాడి, అరెస్టులు.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రుల తీరుపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరసన తెలిపితే దాడులు చేస్తారా అని నిలదీశారు. తాజాగా మంత్రి హరీశ్ రావుపై షర్మిల మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీశ్‌ రావు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మర్చిపోయినట్టు నాటకాలు ఆడారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. నివాళులర్పించారు. శ్రీకాంతా చారి అగ్గిపెట్టె తెచ్చుకొని అమరుడైతే.. హరీశ్‌ రావు అగ్గిపెట్టె మర్చిపోయి మంత్రి అయ్యారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం డ్రామాలు ఆడుతోందని, వారందరికీ ఆస్కార్ అవార్డులు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

మరోవైపు.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు వైఎస్సార్టీపీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఫోన్‌ చేసిన ప్రధాని మోడీ.. ఆమెను పరామర్శించారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఘటనలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. వైఎస్‌ షర్మిలకు సానుభూతి వ్యక్తం చేశారని ఆపార్టీ నేతలు తెలిపారు. అరెస్ట్‌ చేసినా ఏ మాత్రం బెదరకుండా ధైర్యంగా వ్యవహరించారని స్వయంగా ప్రధాని మోడీ.. షర్మిల తీరును ప్రశంసించారని తెలుస్తోంది.

కాగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో షర్మిల పాదయాత్ర చేస్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమె కాన్వాయ్ పై జరిగిన దాడిలో వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనికి నిరసనగా షర్మిల ధ్వంసమైన కారులోనే నిరసన తెలిపేందుకు ప్రగతి భవన్ కు బయల్దేరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను కారులో ఉండగానే పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ పరిస్థితులు హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం