Telangana: బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతోందిగా.. ఖమ్మం జిల్లాలో వింతను చూసి ప్రజలు షాక్..
బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగిపోతోందంటూ అక్కడి జనం అంతా చెప్పుకుంటున్నారు.. వేప చెట్టుకు కల్లు కారడాన్ని అందరూ వింతగా చూస్తున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ గుడి..
బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగిపోతోందంటూ అక్కడి జనం అంతా చెప్పుకుంటున్నారు.. వేప చెట్టుకు కల్లు కారడాన్ని అందరూ వింతగా చూస్తున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ గుడి తండా గ్రామం ఇది. ఈ గ్రామస్తుడు రాందాస్ కుటుంబ సభ్యులు ఓ వేప చెట్టుకింద నిత్యం పూజలు చేస్తుంటారు.. కొంత కాలంగా ఈ చెట్టు నుంచి తెల్లడి ద్రవం కారడం గమనించింది వీరి కుటుంబం. ముందు పెద్దగా పట్టించుకోలేదు.. జాగ్రత్తగా గమనించి చూస్తే కల్లులా అనిపించింది.. వేప చెట్టుకు కల్లు కారుతోందనే వార్త ఈనోటా, ఆనోటా అందరికీ తెలిసిపోంది.. దీంతో గుడితండాతోపాటు చుట్టుపక్కల గ్రామస్తులంతా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు.. ఇది ఏ దేవుని మహిమో తమకు అర్థం కావడం లేదంటున్నారు రామదాసు..
సాధారణంగా తాటి, ఈత చెట్లకు కల్లు వస్తుంది. ఇక్కడ వేప చెట్టు నుంచి కల్లు కారడం ఏమిటో అంతుబట్టడంలేదంటున్నారు స్థానికులు.. ఇలాంటి దృశ్యాన్ని తాము గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు.. కొందరైతే ఏకంగా కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేస్తున్నారు.. బ్రహ్మంగారు చెప్పినట్లు లోకంలో ఎంతో వింతలు జరిగిపోతున్నాయని చెప్పుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..