AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భర్త.. భార్య.. మధ్యలో ప్రియుడు.. సినిమాను మించిన సీన్స్.. మ్యాటర్ తెలిస్తే మీటర్ పగిలిపోద్ది..

ఇదొక ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ. ఆ భార్యకు భర్త వద్దు..ప్రియుడే కావాలి. కానీ ఆ భర్తకు మాత్రం భార్య కావాలి. పోలీసుల ముందుకొచ్చింది ఈ వింత పంచాయితీ దీంతో ఏం చేయాలో..

Hyderabad: భర్త.. భార్య.. మధ్యలో ప్రియుడు.. సినిమాను మించిన సీన్స్.. మ్యాటర్ తెలిస్తే మీటర్ పగిలిపోద్ది..
Hyderabad Love Story
Shiva Prajapati
|

Updated on: Jan 31, 2023 | 9:31 AM

Share

ఇదొక ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ. ఆ భార్యకు భర్త వద్దు..ప్రియుడే కావాలి. కానీ ఆ భర్తకు మాత్రం భార్య కావాలి. పోలీసుల ముందుకొచ్చింది ఈ వింత పంచాయితీ దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. చివరకు ముస్లిం మత పెద్దల దగ్గరకు చేరింది.

హైదరాబాద్‌ పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెందిన ఓ వివాహిత..భర్తను వదిలించుకునేందుకు పక్కా ప్లాన్‌ వేసింది. టీలో నిద్రమాత్రలు కలిపిచ్చి బంగారం, నగదు తీసుకొని ప్రియుడితో పరారైంది. రెండ్రోజుల తర్వాత మత్తు వీడిన భర్త..భార్య కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి.

7 నెలల క్రితం వీరికి వివాహం జరిగింది. ఐతే తనకు అసలు ఈ పెళ్లంటేనే ఇష్టం లేదని..తాను మరొకరిని ప్రేమిస్తున్నానని తల్లిదండ్రులకు చెప్పినా బలవంతంగా పెళ్లి చేశారంటోందామె. ఇంత జరిగినా తనకు భార్యే కావాలంటున్నాడు భర్త. తాను ఇప్పటివరకు ఏం చేసినా పట్టించుకోనని చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి

కానీ భర్తతో వెళ్లేందుకు ససేమిరా అంటోంది భార్య. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ముస్లిం మత పెద్దల దగ్గరే తేల్చుకోమ్మని పంపించారు. ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మతపెద్దలు చెప్పినా లెక్కచేయలేదు ఆలియా. ప్రియుడే ముద్దు.. భర్త వద్దేవద్దంటూ తెగేసి చెప్పింది. అటు భర్త.. ఇటు భార్య వినకపోవడంతో ఏం చేయాలో అర్థంకాక జుట్టుపీక్కుంటున్నారు మతపెద్దలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..