Hyderabad: గేమ్ బాగుందని టెంప్ట్ అవుతున్నారా? నెక్ట్స్ జరిగేదిదే.. తస్మాత్ జాగ్రత్త..!

అమాయకులను మోసం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా గేమింగ్‌, బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్ ద్వారా గేమింగ్, బెట్టింగ్‌లకు పాల్పడుతున్న..

Hyderabad: గేమ్ బాగుందని టెంప్ట్ అవుతున్నారా? నెక్ట్స్ జరిగేదిదే.. తస్మాత్ జాగ్రత్త..!
Online Games
Follow us

|

Updated on: Jan 31, 2023 | 9:04 AM

అమాయకులను మోసం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా గేమింగ్‌, బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్ ద్వారా గేమింగ్, బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠా గతేడాది డిసెంబర్‌లో చేవెళ్లకు చెందిన హర్షవర్ధన్‌ అనే విద్యార్థి నుంచి 98 లక్షలను ఈ ముఠా కాజేసింది. హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఈ ముఠాకు చెందిన 8 మంది ముఠా సభ్యులను సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పలువురికి ఆన్‌లైన్ బెట్టింగ్‌ వివరాలను పంపుతూ..వారిని గేమ్స్ ఆడిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్ క్రైమ్ డీసీపీ కలమేశ్ సింగన్వార్ తెలిపారు. నిందితుల ఖాతాల్లోని నగదుతోపాటు వారి వద్ద నుంచి 193 మొబైల్ ఫోన్లు, 21 ల్యాప్‌ టాప్‌‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముఠాకు చెందిన మోహిన్ పాషా, కరణ్ అరోరా, సంజీవ్ కుమార్, కరణ్ మల్హోత్రా, హవాల్దాని, మోహిత్ కుమార్, దినేష్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. వీరు ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ వెబ్‌ సైట్‌‌లు, అప్లికేషన్‌‌లను నడుపుతున్నారు. ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటానికి, బెట్టింగ్‌‌లు ఆడటానికి వినియోగదారుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. లావాదేవీలు నిర్వహించేందుకు ఆయా బ్యాంకుల్లో కరెంట్ బ్యాంక్ ఖాతాలను తెరిచారు.

ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ ముఠా వినియోగదారులు చేసిన లావాదేవీల స్క్రీన్ షాట్‌ను సేకరించి, బ్యాంక్ ఖాతాతో ధృవీకరించిన తర్వాత రాష్ట్రంలో నిషేధించబడిన ఆన్‌ లైన్ గేమింగ్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆన్‌లైన్ లోన్‌యాప్‌లు, ఉద్యోగాల ఇప్సిస్తామని మోసం చేసే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

సైబర్‌ క్రైమ్‌ జరిగితే 1930కి కాల్‌ చేస్తే డబ్బు రికవరీ!

అరెస్టయిన నిందితులంతా ఢిల్లీ, ఉత్తరాఖండ్, కర్నాటకకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా పెద్దగా చదువుకోకపోయినా, ఆన్‌లైన్‌లో మోసాలు చేయడంలో ఎక్స్‌ఫర్ట్ అని పోలీసులు తెలిపారు. సైబర్‌ క్రైమ్‌ జరిగినప్పుడు వెంటనే 1930కి కాల్‌ చేస్తే డబ్బు రికవరీ చేసే ఛాన్స్‌ ఉందని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..