Koppula Eshwar: అసెంబ్లీ ఎన్నికల్లో 7 చోట్ల ఓడిన బీఆర్ఎస్.. పెద్దపల్లిలో కొప్పుల వ్యూహమేంటీ..?
ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారిందట ఆ లీడర్ పరిస్థితి..! ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నిన్నటి దాకా మంత్రిగా ఉన్న ఆయనకు జిల్లాలో ఎదురేలేని పరిస్థితి..! అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తాజాగా ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో తనకున్న పరిచయాలు, పలుకుబడి కలిసి వస్తుందని భావించారు. తీరా గ్రౌండ్‌లోని వెళ్లిన కొద్దీ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో షాక్ అవుతున్నారట.

ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారిందట ఆ లీడర్ పరిస్థితి..! ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నిన్నటి దాకా మంత్రిగా ఉన్న ఆయనకు జిల్లాలో ఎదురేలేని పరిస్థితి..! అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తాజాగా ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో తనకున్న పరిచయాలు, పలుకుబడి కలిసి వస్తుందని భావించారు. తీరా గ్రౌండ్‌లోని వెళ్లిన కొద్దీ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో షాక్ అవుతున్నారట. సెకండ్ క్యాడర్ కాస్తా.. అధికార పార్టీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారట. తన పేరు ప్రతిష్టలు.. కేసీఆర్ చేసిన అభివృద్ధి గెలిపిస్తుందనుకుంటే.. చుక్కలు కనిపిస్తున్నాయట పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు..!
కొప్పుల ఈశ్వర్.. 2004 నుంచి ఓటమి లేకుండా గెలిచిన చరిత్ర ఆయనది.. కేసీఆర్ రెండవ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. పార్టీలో సీనియర్ నాయకుడు కావడం, జిల్లాలో విస్తృత పరిచయాలు, రాజకీయాలపై పట్టు ఉన్న నేతగా మంచి పేరు ఉంది. ఇరవై ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభం ఆయనది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఓటమి తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఈశ్వర్‌ని అభ్యర్థిగా ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కోల్ బెల్ట్ ఏరియాలో విస్తరించి ఉన్న స్థానం కావడంతో.. కార్మిక నేతగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన్ని వ్యూహాత్మకంగానే ఎంపిక చేశారు గులాబీ బాస్.
ఇక్కడ వరకు బాగానే ఉంది. తనకున్న పరిచయాలతో గెలుపు సాధించవచ్చనే లెక్కలూ వేసుకున్నారట ఈశ్వర్. టికెట్ దక్కిన తర్వాత ఫీల్డ్‌కి వెళితే అసలు విషయం అర్దమమవుతుందట. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో విస్తరించి ఉన్న లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా కారు పార్టీకి లేకపోవడం, క్యాడర్‌లో నిరాశ ఉందట. ఓడిన అభ్యర్థులు ఇంకా షాక్ నుంచి కోలువడం లేదట. ఎన్నికల ప్రచారంలో వేగంగా పాల్గొనలేకపోతున్నారట. కొన్నిచోట్ల ఇంత వరకు ప్రచారమే మొదలుపెట్టలేదట కార్యకర్తలు.
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, మంథని, రామగుండం, పెద్దపల్లి, తాను ప్రాతినిధ్యం వహించిన ధర్మపురిలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ధాటికి గులాబీ పార్టీ సెకండరీ క్యాడర్ పెద్ద ఎత్తున హస్తం పార్టీలో చేరిపోయారు. స్థానిక సంస్థల్లో ఉన్న మెజారిటీ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఫీల్డ్‌లో పార్టీకి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటుంది. అదీ గాక ఓడిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో మొక్కుబడిగా తిరుగుతున్నారట. దీంతో మిగిలిన శ్రేణులను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారనే చర్చ సాగుతుంది. చోటా మోటా నేతలంతా సోషల్ మీడియాకే పరిమితమై ఆహా.. ఓహో అంటున్నారే తప్ప జనంలోకి వెళ్లడం లేదనేది బాహాటంగా విమర్శలు వస్తన్నాయట.
పార్టీ క్యాడర్ పరిస్థితి ఇలా ఉంటే.. పారిశ్రామిక ప్రాంతం కావడంతో కార్మిక నేతగా తనుకన్న పరిచయాలతో బండిని లాగిద్దాం అనుకుంటే అక్కడ పరిస్థితి ఇబ్బందిగా ఉందట. సింగరేణిలో ఇటీవలి గుర్తింపు ఎన్నికల్లో పార్టీ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ఓడిపోయింది. అయితే తన ఇమేజ్‌తో కార్మికులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు కొప్పుల ఈశ్వర్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సింగరేణికి చేసిన పనులను గుర్తు చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో సింగరేణి కార్మికుల ఓట్లు కీలకంగా మారానున్నాయి. గతం కొప్పుల కూడా సింగరేణి కార్మికుడు కావడంతో ఈ ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, మంథని శాసనసభ నియోజకవర్గాల పరిధిలో సింగరేణి కార్మికుల ఓట్లే కీలకంగా ఉంటాయి. ఇవి గాక, సింగరేణి కాంట్రాక్టు కార్మిక కుటుంబాలు, ఆర్‌ఎఫ్‌సీఎల్, ఎన్టీపీసీ, సిమెంట్ పరిశ్రమల కార్మికుల ఓట్లు కూడా గణనీయంగా ఉన్నాయి. మరోవైపు తన స్వంత నియోజకవర్గం ధర్మపురిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ అధిక ఓట్లు వస్తే, గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. దీంతో త్రిముఖ పోరు ఉండే అవకాశముంది. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్, బీజేపీని తట్టుకుని, ఈశ్వర్ దూకుడు పెంచుతూనే క్యాడర్‌లో ఉత్సాహం వస్తుందనే భావన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
