AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Games: పచ్చనికాపురంలో చిచ్చురేపిన ఆన్‌లైన్‌ గేమ్స్.! కాపురమే కూలిపోయిందిగా.

Online Games: పచ్చనికాపురంలో చిచ్చురేపిన ఆన్‌లైన్‌ గేమ్స్.! కాపురమే కూలిపోయిందిగా.

Anil kumar poka
|

Updated on: Mar 26, 2024 | 11:48 AM

Share

ఇంటిని చక్కదిద్దాల్సిన ఓ ఇల్లాలు నిలువునా ముంచేసింది.. భర్త కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఆన్‌లైన్‌ గేమ్‌లో పోగొట్టింది. నమ్మి భార్య ఖాతాలో లక్షల రూపాయలు జమచేస్తే అతని నమ్మకాన్ని వమ్ము చేసింది.. అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. దాంతో మనస్తాపం చెందిన ఆ భర్త పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించాడు. చివరికి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.

ఇంటిని చక్కదిద్దాల్సిన ఓ ఇల్లాలు నిలువునా ముంచేసింది.. భర్త కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఆన్‌లైన్‌ గేమ్‌లో పోగొట్టింది. నమ్మి భార్య ఖాతాలో లక్షల రూపాయలు జమచేస్తే అతని నమ్మకాన్ని వమ్ము చేసింది.. అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. దాంతో మనస్తాపం చెందిన ఆ భర్త పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించాడు. చివరికి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. భువనగిరి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చిరువ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సొంత ఇల్లు నిర్మించుకోవాలన్న లక్ష్యంతో అతను కొన్నేళ్లుగా ఎంతో కష్టపడి లక్షలరూపాయలు కూడబెట్టాడు. ఆ సొమ్మంతా భార్య పేరున ఎకౌంట్‌ ఓపెన్‌ చేసి అందులో జమచేయాల్సిందిగా భార్యకు ఇచ్చాడు. భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ అద్దె ఇంట్లో ఉంటూ ఎంతో కష్టపడి రూ.16లక్షలు పోగుచేశాడు. ఇటీవలే.. 100 గజాల ప్లాటును రూ.15 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. భార్యను తీసుకెళ్లి ఆ ప్లాటును చూపించాడు. ఇదంతా పార్లమెంటు ఎన్నికల షెడ్యూలుకు ముందు జరిగింది. ఎన్నికల షెడ్యూలు విడుదలైతే పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవడం కుదరదని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి చెప్పడంతో.. మార్చి 14న రిజిస్ట్రేషన్‌కు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. బ్యాంకులో జమ చేసిన రూ.16 లక్షలు తెచ్చుకుందామని భార్యతో చెప్పగా.. అప్పటికే ఆ డబ్బును ఆన్‌లైన్‌ గేముల్లో పోగొట్టుకున్న ఆమె, ఆ విషయాన్ని దాచిపెట్టి.. ఏవేవో సాకులు చెబుతూ బ్యాంకుకు వెళ్లకుండా తప్పించుకుంటోంది.

17న ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో.. కోడ్‌ ముగిసిన అనంతరమే రిజిస్ట్రేషన్‌ చేసుకుందామని భర్తకు నచ్చజెప్పింది. ఆమె మాటలు నమ్మిన అతడు.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి అదే మాట చెప్పాడు. దీంతో ఆయన కనీసం రూ.లక్ష అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరాడు. అందుకు అంగీకరించిన సదరు వ్యక్తి భార్యను లక్షరూపాయలు తేడవానికి బ్యాంకుకు వెళ్దాము రమ్మన్నాడు. అప్పుడు కూడా ఆమె ఏదో సాకు చెప్పడంతో అతడికి అనుమానం వచ్చింది. దీంతో పరిచయస్తుల సాయంతో బ్యాంక్‌ బ్యాలెన్స్‌ను చెక్‌ చేయగా.. అందులో కేవలం రూ.19 వేలు మాత్రమే ఉన్నట్లు తేలింది. బిత్తరపోయిన అతడు.. ఇంటికి వెళ్లి భార్యను నిలదీయగా.. అసలు విషయం చెప్పింది. తాను ఆన్‌లైన్‌ గేమ్‌లో డబ్బుపోయిందని, మళ్లీ ఆడి అంతకు రెట్టింపు సంపాదించి ఇస్తానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో భర్త షాకయ్యాడు. తనకష్టమంతా క్షణాల్లో కరిగిపోవడంతో మనస్తాపానికి గురైన సదరు భర్త పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోబోయాడు. చుట్టుపక్కలవారు, స్నేహితులు అతనికి సర్ది చెప్పాడు. భార్యను మందలించే ప్రయత్నం చేయగా అందరిపేర్లూ రాసి సూసైడ్‌ చేసుకుంటానని బెదిరించింది. డిప్రెషన్‌లకు లోనైన ఆ వ్యక్తిని చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..