Holi 2024: ఇలాంటి హోలీ వేడుకల్ని ఇంకెక్కడా చూడలేం.! వీడియో వైరల్.
హోళి పండుగ గిరిజనుల అభిమాన పండుగ. హోళీ వచ్చిందంటే ఆదివాసీ గూడాల్లో సంబరాలు అంబరాన్నంటుతాయి. ఆదిలాబాద్‌జిల్లాలో ఆదివాసీలు అత్యంత నియమ నిష్టలతో జరుపుకునే ప్రకృతి పండుగ హోళీ. ఫాల్గుణ మాసం చంద్ర దర్శనం మొదలుకొని ఫాల్గుణ శుక్ల పౌర్ణమి వరకు వెన్నెల రాత్రుల్లో ఆడే ఆట పాడే పాట.. కొట్లాట అన్ని కొత్తగానే దర్శనమిస్తాయి. పండుగకు నెల ముందు నుంచే ప్రకృతిలో దొరికే ఆకులు, అలములు, గోగు పూలను తెచ్చి రంగుల్ని తయారుచేసుకుంటారు.
హోళి పండుగ గిరిజనుల అభిమాన పండుగ. హోళీ వచ్చిందంటే ఆదివాసీ గూడాల్లో సంబరాలు అంబరాన్నంటుతాయి. ఆదిలాబాద్‌జిల్లాలో ఆదివాసీలు అత్యంత నియమ నిష్టలతో జరుపుకునే ప్రకృతి పండుగ హోళీ. ఫాల్గుణ మాసం చంద్ర దర్శనం మొదలుకొని ఫాల్గుణ శుక్ల పౌర్ణమి వరకు వెన్నెల రాత్రుల్లో ఆడే ఆట పాడే పాట.. కొట్లాట అన్ని కొత్తగానే దర్శనమిస్తాయి. పండుగకు నెల ముందు నుంచే ప్రకృతిలో దొరికే ఆకులు, అలములు, గోగు పూలను తెచ్చి రంగుల్ని తయారుచేసుకుంటారు. పచ్చని ప్రకృతిలో లభించే స్వచ్చమైన గోగుపూల నుండి తీసిన రంగులతోనే హోళీ పండుగ జరుపుకోవడం తరతరాలనుంచి వస్తున్న సంప్రదాయం. హోళీరోజు గ్రామ పటేల్ , దేవాలరికి కుడక ఇస్తేనే గూడెంలో కొనసాగుతున్నట్టు లెక్క, లేదంటే.. ఆ వ్యక్తులు ఆ కుటుంబాలు గూడెంతో ఎలాంటి సంబంధాలు లేవని భావిస్తారు. దీనినే దురాడీ కోబ్రే లేదా కుడుకల పండుగ అని పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా గూడెంలో ఉండే ప్రతి కుటుంబం నుండి రెండు కుడుకలు, కొద్దిపాటి చక్కెరను పటేల్‌గా పిలుచుకునే గ్రామ పెద్ద ఇంటి వద్ద పెద్దలకు అందజేయాల్సి ఉంటుంది. ఈ పండగ రోజున గూడెంలో నివాసం ఉండే ఇళ్ల సంఖ్యతో పాటు ప్రతి కుటుంబ జనాభాను లెక్కిస్తారు. ప్రతి ఇంటిలోని ప్రతి ఒక్కరి పేరుతో వీటిని గ్రామ పెద్దకు అందచేస్తారు. ఈ కుడుకుల లెక్కలతోనే గూడెంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? వారిలో ఆడపిల్లలు ఎంతమంది? పెళ్లై వలస వచ్చిన కోడల్లెందరు అనే లెక్క తేలుతుంది. ఆదివాసీలకు వారి గ్రామం అంటే ప్రాణం. ఉన్న ఊరిని వదిలెల్లడం అంటే ఊపిరి ఆగినట్టుగా బావిస్తారు ఆదివాసీలు. ఈపండుగ వేళ ప్రసాదాన్ని తీసుకున్న కుటుంబాలే ఊరికి చెందినవి.. మిగిలిన వారితో ఊరికి సంబంధం లేనట్టుగానే భావిస్తారు. ఊరొదిలి వలసలు పోయిన వారైనా.. ఇల్లరికం పేరిట మరో ఊరికి వెళ్లిపోయిన వారికైనా కామదహనం వేళ దురాడి పండుగ ప్రసాదాన్ని పంచిపెట్టడం నిషేదం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.