Holi 2024: టమాటాలతో హోలీ.. తెలుగు రాష్ట్రాల్లో వినూత్నంగా హోలీ సంబరాలు.

Holi 2024: టమాటాలతో హోలీ.. తెలుగు రాష్ట్రాల్లో వినూత్నంగా హోలీ సంబరాలు.

Anil kumar poka

|

Updated on: Mar 26, 2024 | 12:03 PM

దేశవ్యాప్తంగా హోలీ పండుగ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లోనూ హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. హైదరాబాద్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా హోలీవేడుకలు జరుపుకుంటున్నారు..చిన్నాపెద్దా తేడా లేకుండా హోలీ ఆడారు. వేడుకల్లో భాగంగా మహిళలు, చిన్నారులు ఆటపాటలతో అలరించారు. అనంతరం నిర్వహించిన కామదహనానికి హాజరయ్యారు.

దేశవ్యాప్తంగా హోలీ పండుగ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లోనూ హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. హైదరాబాద్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా హోలీవేడుకలు జరుపుకుంటున్నారు..చిన్నాపెద్దా తేడా లేకుండా హోలీ ఆడారు. వేడుకల్లో భాగంగా మహిళలు, చిన్నారులు ఆటపాటలతో అలరించారు. అనంతరం నిర్వహించిన కామదహనానికి హాజరయ్యారు. అంతా మంచి జరగాలని వేడుకున్నారు.అటు జనగామ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబురాల్లో మునిగిపోయారు. జనగామలో వాకర్స్ అసోసియేషన్, మిత్రమండలి ఆధ్వర్యంలో యువకులు సందడి చేశారు. డీజే పాటలకు డాన్సులు చేస్తూ ఎంజాయ్‌ చేశారు. వరంగల్‌లో డిఫరెంట్‌గా టమాటలతో హోలీ జరుపుకున్నారు వరంగల్‌ ప్రజలు. టమాటాలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ హోలీ సెలబ్రేట్‌ చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ హోలీ వేడుకలు జరుగుతున్నాయి..అల్లూరి జిల్లా తాజంగిలో హోలీ సందర్భంగా రాధాకృషనులకు ప్రత్యేక పూజలు చేశారు..75 అడుగుల కట్టెల దహనం ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. కట్టెలపై ఉన్న జెండాను పట్టుకునేందుకు స్థానికుల మధ్య పోటీ పెట్టారు..కింద పడకుండా పట్టుకునే వారికి నగదుతో ప్రోత్సాహం ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..