Telangana Weather: తెలంగాణకు వర్ష సూచన.. మరో మూడు రోజుల పాటు ఆ జిల్లాల్లో దంచుడే..
రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ ( Hyderabad) సహా అనేక జిల్లాల్లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీవర్షం కురుస్తూనే ఉంది..
Telangana Rains: రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ ( Hyderabad) సహా అనేక జిల్లాల్లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీవర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అత్యధికంగా 12.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో 3.1సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అంబర్‌పేట, నారాయణగూడ, బండ్లగూడ, జీడిమెట్ల, హయత్‌నగర్‌లో కూడా 16 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఇదిలా ఉంటే మరో 2-3రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
కాగా ఉత్తర ఒడిశాను ఆనుకొని ఉన్న దక్షిణ ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉదయం అల్పపీడనం ఏర్పడింది. అనంతరం అది వాయవ్యంగా పయనించి ఉత్తర ఛత్తీస్‌గఢ్ తీరంలో కేంద్రీకృతమై స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతోనే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిఫుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో మంగళవారం ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ రూరల్, అర్బన్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డిలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..