AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందగత్తెల ఆనందం కోసం అదిరిపోయే లుక్… కొత్తరూపు దిద్దుకున్న చారిత్రక నిర్మాణాలు

సుందరీమణుల రాక కోసం సర్వం సిద్ధమైంది. వారికి ఘనస్వాగతం పలికి అబ్బురపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు..భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఖిలా వరంగల్ కోట, రామప్ప, వేయి స్తంభాలగుడి విద్యుత్ దీపాల కాంతులతో వెలిగి పోతున్నాయి.. ఖిలా వరంగల్ కోట లో సౌండ్స్ అండ్ లైటింగ్ షో ఏర్పాటు చేశారు.

అందగత్తెల ఆనందం కోసం అదిరిపోయే లుక్... కొత్తరూపు దిద్దుకున్న చారిత్రక నిర్మాణాలు
Unesco Sites
G Peddeesh Kumar
| Edited By: Jyothi Gadda|

Updated on: May 11, 2025 | 11:07 AM

Share

మిస్ వరల్డ్ పోటీలకు తొలిసారి తెలంగాణ ఆతిథ్య మిస్తుంది.. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న విశ్వ వ్యాప్త అందగత్తెలు తెలంగాణలోని వివిధ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు.. రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన యునెస్కో గుర్తింపుపొందిన నిర్మాణం రామప్ప, వేయి స్తంభాలగుడి ఖిలా వరంగల్ సందర్శనకు వస్తుండడంతో అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. ఆ చారిత్రక నిర్మాణాలను చూసి సుందరీమణులు వాహ్ అనిపించేలా కొత్త రూపుదిద్దుకున్నాయి.. విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతున్నాయి.. అందగత్తలను మించిన అందంతో మురిసిపోతున్న ఆ చారిత్రక నిర్మాణాలు ఎలా దగదగలాడుతున్నాయో ఓ లుక్కేయండి…

మిస్ వరల్డ్ పోటీలకు తొలిసారి తెలంగాణ గడ్డ వేదిక అయింది.. హైదరాబాద్ మహానగరం ఇప్పటికే విశ్వసుందరులను అబ్బురపరిచేలా కొత్త రూపుదిద్దుతుంది..ఆతిధ్యం అదరహో అనిపించింది.. ఇక ఆ సుందరిమణులు తెలంగాణ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు రూట్ మ్యాప్ రెడీ అవ్వడంతో అక్కడ చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి…

సుందరీమణుల రాక కోసం సర్వం సిద్ధమైంది..14 వ తేదీన 116 దేశాలకు చెందిన అందబామలు ఓరుగల్లు కు రాబోతున్నారు.. కాకతీయ వాసరత్వ సంపద వేయి స్తంభాలగుడి, రామప్ప, కిలా వరంగల్ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు..

ఇవి కూడా చదవండి

వారికి ఘనస్వాగతం పలికి అబ్బురపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు..భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఖిలా వరంగల్ కోట, రామప్ప, వేయి స్తంభాలగుడి విద్యుత్ దీపాల కాంతులతో వెలిగి పోతున్నాయి.. ఖిలా వరంగల్ కోట లో సౌండ్స్ అండ్ లైటింగ్ షో ఏర్పాటు చేశారు.

116 దేశాలకు చెందిన అందమైనబామలు ప్రత్యేక వాహనాలలో 14 వ తేదీ సాయంత్రం హనుమకొండ కు చేరుకుంటారు..హనుమకొండ హరిత కాకతీయ హోటల్ లో కొంతసేపు విశ్రాంతి తీసుకొని అక్కడి సాయంత్రం 5 గంటలకు రెండు బృందాలుగా విడిపోతారు.. ఒక గ్రూప్ యూనిస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శకు వెళ్తుంది.. మరో గ్రూప్ వేయి స్తంభాల గుడి, ఖిలా వరంగల్ కోట సందర్షిస్తారు..

సుందరిమణులు సందర్శించిన పర్యాటక ప్రదేశాలన్నీ ఇప్పుడు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.. ప్రత్యేక మెనూ తో వంటకాలను రెడీ చేస్తున్నారు.. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.