AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో పూల్ మఖానాని ఇలా తింటే బోలెడన్నీ బెనిఫిట్స్‌..! షుగర్‌ కంట్రోల్‌, గుండె పదిలం..

ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరిచే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వాటిలో పూల్‌ మఖానా కూడా ముఖ్యమైనది అంటున్నారు పోషకాహార నిపుణులు. వేసవిలో బాడీ హీట్‌ తగ్గించడంలో మఖానా మంచి మెడిసిన్‌లా పనిచేస్తుందని చెబుతున్నారు. ఎండాకాలంలో తరచూ మఖానాను ఆహారంలో చేర్చుకోవటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అంతేకాదు.. పుష్కలమైన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్‌లు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, మఖానా పూర్తి ప్రయోజనాలు పొందాలంటే తినే విధానం కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: May 11, 2025 | 8:32 AM

Share
పూల్‌ మఖానా పాలలో కలిపి తీసుకోవడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియలో తోడ్పడుతుంది. దీంతో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా కడుపుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. అదనపు శక్తి లభిస్తుంది. అలసట తగ్గుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

1 / 5
మఖానా అలా నేరుగా కాకుండా పాలలో నానబెట్టి తింటే రెట్టింపు లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. పాలలోని ప్రోటీన్, కాల్షియం, మఖానాలోని ఫైబర్‌తో కలిసి సూపర్‌ఫుడ్‌గా మారుతుంది. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా మారుతుంది. దీని వల్ల శరీరం కూడా ఎనర్జీగా ఉంటుంది.

2 / 5
మఖానా బ్లడ్ షుగర్ లెవల్స్‌ని సరి చేస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా మారుతుందని చెబుతున్నారు. అంతేకాదు, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలోని ఆక్సిడెటీవ్ స్ట్రెస్‌ని తగ్గించి ఒత్తిడిని దూరం చేస్తాయి. దీని వల్ల గుండెపై అదనపు భారం కూడా తగ్గుతుంది.

3 / 5
మఖానాని పాలలో నానబెట్టి తినడం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. పాలు, మఖానా రెండింటిలోనూ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎముకలు బలంగా మారతాయి. వృద్ధాప్యంలో వచ్చే ఎముకల సమస్యల్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

4 / 5
పాలలో నానబెట్టిన మఖానా తీసుకోవటం వల్ల ఒత్తిడి తగ్గి నిద్ర నాణ్యత పెరుగుతుంది. అంతేకాదు... యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి. దీంతో చర్మం యవ్వనంగా కాంతివంతంగా మారుతుంది. వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది.

5 / 5