Warangal: ప్రీతి ఘటన మరువకముందే వరంగల్ జిల్లాలో మరో ఘోరం.. పాపం రక్షిత కూడా..

మెడికో స్టూడెంట్‌ ప్రీతి ఘటన మరువకముందే.. ర్యాగింగ్‌ భూతానికి మరో విద్యార్థిని బలికావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తోటి విద్యార్థి వేధింపులు తాళలేక అదే వరంగల్ జిల్లాలో..

Warangal: ప్రీతి ఘటన మరువకముందే వరంగల్ జిల్లాలో మరో ఘోరం.. పాపం రక్షిత కూడా..
Rakshita
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 27, 2023 | 9:41 AM

మెడికో స్టూడెంట్‌ ప్రీతి ఘటన మరువకముందే.. ర్యాగింగ్‌ భూతానికి మరో విద్యార్థిని బలికావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తోటి విద్యార్థి వేధింపులు తాళలేక అదే వరంగల్ జిల్లాలో రక్షిత అనే 20ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్‌ సూటైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తుండటంతో రక్షిత సూసైడ్ చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కూతులు రక్షిత నర్సంపేట లోని జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ మూడవ సంవత్సరం చదువుతోంది. అయితే, రక్షితకు చెందిన ఫొటోలను రాహుల్ అనే వ్యక్తి, ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని వేధించడంతో మనస్తాపం చెందిన యువతి.. వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

అయితే, అంతకుముందే రాహుల్ వేధింపులు ఎక్కువవ్వడంతో హాస్టల్‌లో ఉండలేనంటూ రక్షిత తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు బంధువుల ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. ఆదివారం బంధువుల ఇంట్లోనే ఉన్న రక్షిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు రక్షిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకి తరలించారు.

ప్రీతి లాగే తమ కూతురు కూడా సీనియర్ల వేధింపులకు బలయిందని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ విద్యార్థి ప్రీతి సీనియర్ వేధింపులు తాళలేక లేక ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి నిమ్స్ లో కన్నుమూసింది. ఈ రెండు ఘటనలు వరంగల్ జిల్లాలోనే జరగడం కలకలం రేపుతోంది.

ఇవి కూడా చదవండి

అయితే, బెదిరింపుకు పాల్పడిన రాహుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని రక్షిత బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?