Kakatiya University: కాకతీయలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. లాఠీ ఝుళిపించిన పోలీసులు
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థి గ్రూపుల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సివచ్చింది
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థి గ్రూపుల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సివచ్చింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీలకు పనిచెప్పాల్సివచ్చింది. అయితే విద్యార్థుల మధ్య ఘర్షణకు కారణాలింకా తెలియరాలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూనివర్సిటీలోని మెస్‌లో రాత్రి 7:00 సమయంలో పీజీ విద్యార్థులు & ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ మధ్య గొడవలు చెలరేగాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. అనంతరం వర్సిటీలోని గొడవలపై రెగ్యులర్ పీజీ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యూనివర్సిటీకి చేరుకున్న పోలీసులు విద్యార్థులకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
కొనసాగుతోన్న బందోబస్తు.. అయితే అర్ధరాత్రి దాటాక విద్యార్థులు మళ్లీ గొడవలకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. హాస్టళ్లలోకి వెళ్లి లాఠీ ఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే పోలీసులు, యూనివర్సిటీ అధికారులు ఈ గొడవ బయటకు పొక్కకుండా సద్దుమనిగేలా చేశారు. అయితే విద్యార్థుల మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. అందుకే యూనివర్సిటీలో అదనపు బలగాలతో పోలీస్ బందోబస్తు కొనసాగిస్తున్నారు.
Also Read: