Crime News: రూ. 6 వేలు కోసం దంపతుల మధ్య ఘర్షణ.. తెల్లవారేసరికి విగతజీవులుగా మారిన భార్యా, భర్త

ఇంట్లో దాచిన సొమ్ము కనిపించడం లేదని గొడవపడిన భార్యాభర్తలు క్షణికావేశంలో బలవన్మరానికి పాల్పడ్డారు.

Crime News: రూ. 6 వేలు కోసం దంపతుల మధ్య ఘర్షణ.. తెల్లవారేసరికి విగతజీవులుగా మారిన భార్యా, భర్త
Crime
Balaraju Goud

|

Nov 01, 2021 | 8:42 AM

Couple found dead: క్షణికావేశం దంపతుల ప్రాణాలను తీసింది. అప్పుటి వరకు సరదాగా ఉన్న ఆ జంట అంతలోనే అనంతలోకాలకు పయనమయ్యారు. ఇంట్లో దాచిన సొమ్ము కనిపించడం లేదని గొడవపడిన భార్యాభర్తలు క్షణికావేశంలో బలవన్మరానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కామారెడ్డి పట్టణంలోని గోసంగికాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కోదండం సాయిలు (45), పోచవ్వ (42) భార్యాభర్తలు. కూలి పనులు చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. మొదటి ఇద్దరు భార్యలు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో పోచవ్వను మూడో వివాహం చేసుకున్నాడు సాయిలు. వీరికి సంతానం లేదు.

ఇదిలావుంటే, అక్టోబరు 27న ఇంట్లో ఉంచిన రూ. 6 వేలు కనిపించడం లేదని భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. మర్నాడూ ఇదే విషయమై ఇద్దరు పోట్లాడుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన పోచవ్వ ఇంట్లోంచి వెళ్లిపోయింది. అదేరోజు సాయంత్రం సాయిలు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం గోసంగి కాలనీ సమీపంలోని చర్చి వెనకాల రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందడంతో బంధువులు వెళ్లిచూశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయిలు మృతదేహం సగం కాలిపోయి ఉండగా, సమీపంలోని నీటి కుంటలో పోచవ్వ మృతదేహాన్ని గుర్తించారు. సాయిలు నిప్పంటించుకొని చనిపోయాడని, పోచవ్వ కుంటలో దూకి ఆత్మహత్య చేసుకుందని స్థానిక పోలీసులు తెలిపారు. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.

Read Also… Postal Money Home: ఇంటికొచ్చి ఖాతా డబ్బు అందిస్తున్న పోస్టల్‌ శాఖ.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి.. (వీడియో)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu