Battery thiefs arrest: వీళ్లు మామూలు దొంగలు కాదు..జగత్‌ జంత్రీలు..! బ్యాటరీలు చోరీ ఏంటో మరీ.. (వీడియో)

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Nov 01, 2021 | 8:44 AM

ప్రకాశం జిల్లాలో ఇటీవల కాలంలో సెల్ టవర్ బ్యాటరీ దొంగతనాలు ఎక్కువ అయ్యాయి. జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సెల్ టవర్ బ్యాటరీ దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.


ప్రకాశం జిల్లాలో ఇటీవల కాలంలో సెల్ టవర్ బ్యాటరీ దొంగతనాలు ఎక్కువ అయ్యాయి. జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సెల్ టవర్ బ్యాటరీ దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కందుకూరు డిఎస్పీ ఆదేశాల మేరకు కనిగిరి సీఐ ఆధ్వర్యంలో హనుమంతునిపాడు, వెలిగండ్ల ఎస్ ఐ లు సెల్ బ్యాటరీ దొంగతనాల కేసులుపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు… ఎట్టకేలకు బ్యాటరీ దొంగలను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనానికి పాల్పడినవారు ప్రకాశం జిల్లా కంబం కు చెందిన ముగ్గురు, గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఇద్దరు, వినుకొండకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.నిందితులు సెల్ టవర్లలోనే టెక్నీషియన్లుగా పని చేస్తూ దొంగలుగా మారినట్లు పోలీసులు గుర్తించారు. తాము పని చేసిన సెల్ టవర్లలోనే బ్యాటరీలను తేలికగా దొంగిలిస్తూ వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుంటారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి 18 బ్యాటరీలు, రెండున్నర లక్షల సొత్తు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Vijay Sethupathi Bike Photos: BMW బైక్ కొన్న ‘మక్కల్ సెల్వన్’.. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ‘విజయ్ సేతుపతి’.. వైరల్ అవుతున్న ఫొటోస్..
Postal Money Home: ఇంటికొచ్చి ఖాతా డబ్బు అందిస్తున్న పోస్టల్‌ శాఖ.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి.. (వీడియో)

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu