Postal Money Home: ఇంటికొచ్చి ఖాతా డబ్బు అందిస్తున్న పోస్టల్ శాఖ.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి.. (వీడియో)
ఇంటికి ఉత్తరాలే కాదు.. పొదుపు ఖాతాలోని డబ్బును కూడా ఉచితంగా ఇంటికే తెచ్చి ఇస్తామంటోంది పోస్టల్ శాఖ. మీ ఖాతా ఎక్కడున్నా.. అవసరమయ్యే మొత్తం చేరవేస్తామంటోంది. పోస్టల్ పొదుపు ఖాతాలోనివే కాదు..
ఇంటికి ఉత్తరాలే కాదు.. పొదుపు ఖాతాలోని డబ్బును కూడా ఉచితంగా ఇంటికే తెచ్చి ఇస్తామంటోంది పోస్టల్ శాఖ. మీ ఖాతా ఎక్కడున్నా.. అవసరమయ్యే మొత్తం చేరవేస్తామంటోంది. పోస్టల్ పొదుపు ఖాతాలోనివే కాదు.. ఇతర బ్యాంకుల్లో మీ సొమ్ములున్నా వాటిని తెచ్చి ఇస్తామంటోంది. ఇందుకోసం మీ ఖాతాకు ఆధార్ సంఖ్యను అనుసంధానిస్తే చాలంటోంది.
బ్యాంకు నుంచి డబ్బు తీసుకోవడం వృద్ధులు, మహిళలను కాస్త ఇబ్బంది పెట్టే వ్యవహారమే. ఇలాంటి ఇబ్బందులను పోస్టల్ శాఖ తీర్చింది. ఖాతా ఏ బ్యాంకులో ఉన్నా.. ఆధార్‌తో అనుసంధానమైతే, బయోమెట్రిక్ విధానంతో ఇంటికే వచ్చి డబ్బు చెల్లిస్తుంది. ఇందుకు సమీప పోస్టల్ కార్యాలయం ఫోన్ నంబరు తీసుకుని సంప్రదిస్తే సరిపోతుందని, అవసరమైన మొత్తం చెబితే పోస్ట్‌మాన్ డబ్బు తెచ్చి ఇస్తారు. రోజుకు కనీసం రూ.100 నుంచి గరిష్ఠంగా 10వేలు తీసుకోవచ్చు. ఇలా నెల మొత్తం 30 రోజులు సేవలు పొందవచ్చు.రాష్ట్రంలో పోస్టల్ శాఖకు మొత్తం 82.67 లక్షల పొదుపు ఖాతాలున్నాయి. 27.09 లక్షల ఆసరా పింఛనుదారులుండగా.. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళల పింఛన్లకు సంబంధించిన సేవలను తపాలాశాఖ అందజేస్తోంది. తపాలా బ్యాంకుకు నేరుగా వెళ్లి ఎన్నిసార్లు డబ్బులు వేసినా, తీసినా పైసా చెల్లించాల్సిన పనిలేదు. తపాలా ఏటీఎంలలో మాత్రం 5 సార్లు ఉచిత సేవలు పొందవచ్చు.
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..
Vijay Sethupathi Bike Photos: BMW బైక్ కొన్న ‘మక్కల్ సెల్వన్’.. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ‘విజయ్ సేతుపతి’.. వైరల్ అవుతున్న ఫొటోస్..
News Watch: ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు న్యూస్ వాచ్(వీడియో)