Special Tax: బండినుంచి పొగ వచ్చిందో.. టాక్స్ కట్టాల్సిందే..! బెంబేలెత్తున్న వాహనదారులు.. (వీడియో)
జీరో కర్బన్ ఎమిషన్స్.. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ పఠిస్తున్న మంత్రం ఇది. కర్బన ఉద్ఘారాలను తగ్గించాలనే లక్క్ష్యంతో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మరో అడుగు ముందుకేసింది.
జీరో కర్బన్ ఎమిషన్స్.. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ పఠిస్తున్న మంత్రం ఇది. కర్బన ఉద్ఘారాలను తగ్గించాలనే లక్క్ష్యంతో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మరో అడుగు ముందుకేసింది. డీజిల్, పెట్రోల్ బండ్లతో రోడ్ల మీదకి వస్తే భారీ ఫైన్లు విధిస్తున్నాయి అక్కడి స్థానిక ప్రభుత్వాలు. ప్రపంచలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటైన లండన్‌లోని కొన్ని ప్రాంతాలను అల్ట్రా లో ఎమిషన్ జోన్లుగా ప్రకటించారు. అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువ కాలుష్యం విడుదల చేసే వాహనాలు తిరగడానికి అనుమతి లేదు. ఈ నిబంధన ఉల్లంఘించి ఏదైనా వాహనం ఈ మార్గంలో ప్రయాణించిందా.. వాళ్లు స్పెషల్ టాక్స్ కట్టాల్సిందే. ఇలాంటి వాహనాలకు ప్రత్యేక పన్నుగా 12.5 పౌండ్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 12 వేల రూపాయలు పన్నువిధిస్తున్నారు. అల్ట్రా లో ఎమిషన్ జోన్లుగా ప్రకటించిన ఈ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల్లో మాత్రమే ప్రయాణించాలని అక్కడి ప్రభుత్వం కోరుతోంది. దీంతో పాటు పెట్రోలు వాహానాలైతే యూరో స్టేజ్ 4 ప్రమాణాలు పాటించాలని డీజిల్ వాహానాలైతే యూరో స్టేజ్ 6 ప్రమాణాలు పాటించాలని నిర్ధేశించాయి.
కర్బన ఉద్ఘారాలను తగ్గించాలనే టార్గెట్‌తో మొదట బైకులు, స్కూటర్లపై ఈ ప్రత్యేక పన్ను విధించారు. సానుకూల ఫలితాలు రావడంతో ఇప్పుడు ఇతర వాహనాలకు విస్తరించారు. బెటర్ రిజల్ట్స్ వస్తే ఈ విధానాన్ని దేశంలోని ఇతర నగరాల్లోనూ అమలు చేయాలనే యోచనలో ఉంది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ ప్రత్యేక పన్ను విధించడం బాగాలేదని కొందరు వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కాలుష్యం తగ్గించాలంటే కఠిన చర్యలు తప్పవంటున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..
Rare Hobby: ఈ వ్యక్తి చేసే పనికి మెచ్చుకోకుండా ఉండరు..! విద్యార్ధుల చూడాల్సిన మ్యూజియం..(వీడియో)