Crime News: టిక్‌టాక్ స్టార్స్ అవిభక్త సోదరుల మృతి.. అకాల మరణం పట్ల ఎన్నో అనుమానాలు..!

ఛత్తీస్‌గఢ్‌తో పాటు దేశవ్యాప్తంగా పేరుగాంచిన అవిభక్త కవల సోదరులు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

Crime News: టిక్‌టాక్ స్టార్స్ అవిభక్త సోదరుల మృతి.. అకాల మరణం పట్ల ఎన్నో అనుమానాలు..!
Suspected Death Of Famous Twin Brothers
Balaraju Goud

|

Nov 01, 2021 | 7:54 AM

Famous Twin Brothers: ఛత్తీస్‌గఢ్‌తో పాటు దేశవ్యాప్తంగా పేరుగాంచిన అవిభక్త కవల సోదరులు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బలోదాబజార్‌లోని ఖాండా గ్రామానికి చెందిన కవల సోదరులు శివనాథ్, శివరామ్‌లు మరణం అందరిని కలచివేసింది.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అవిభక్త కవలలు శివరామ్‌, శివనాథ్‌ జ్వరంతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఎంతో చురుగా ఉండే ఈ సోదరులు అకస్మాత్తుగా మృతిచెందటాన్ని గ్రామస్థులు నమ్మలేకపోతున్నారు. బలోదబజార్‌ జిల్లాకు చెందిన వీరు తమ శరీర ఆకృతి, చేసే పనులతో సామాజిక మాధ్యమాలు వేదికగా లక్షలాది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా టిక్‌టాక్ వేదికగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇద్దరు పిల్లల మరణంతో గ్రామ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఖైందా గ్రామంలో శివరామ్‌, శివనాథ్‌ 2000 సంవత్సరంలో జన్మించారు. ఒకే శరీరం, రెండు కాళ్లు, రెండు తలలు, నాలుగు చేతులతో ఉన్న వీరిని చూసేందుకు దేశంలోని చాలా ప్రాంతాల నుంచి జనం గ్రామానికి వచ్చేవారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, టిక్‌టాక్‌ వీడియోలతో ఈ కవలలు లక్షలాదిగా అభిమానులను ఆకట్టుకున్నారు. వీరిద్దరూ ఓ పెట్రోల్‌ పంపు వద్ద స్కూటీలో పెట్రోలు పోస్తున్న వీడియో ఇటీవల వైరల్‌గా మారింది. కవలల మృతిపై వెల్లువెత్తుతున్న అనుమానాలతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా వారి కుటుంబాన్ని అదుపులోకి తీసుకుని కొన్ని గంటలపాటు విచారణ చేపట్టారు. మృతదేహాలను పరిశీలించిన డాక్టర్‌ బీకే సోమ సాధారణ మరణమేనని చెప్పారు. అయితే.. పోస్ట్‌మార్టం చేయకపోవటం వల్ల అసలు కారణాలు వెల్లడి కాలేదు.

Read Also… SBI: ఎస్‌బీఐ సేవల కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంట్లో కూర్చుని ఒక SMS లేదా మిస్డ్ కాల్ ఇవ్వండి చాలా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu