Crime News: మాజీ ఎమ్మెల్యేకు జీవిత ఖైదు.. 13 ఏళ్ల విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసిన ప్రత్యేక కోర్టు..
విద్యార్థిని అత్యాచారం చేసిన కేసులో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాజీ ఎమ్మెల్యే యోగేంద్ర సాగర్‌కు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది.
Yogendra Sagar sentenced: 13 ఏళ్ల క్రితం విద్యార్థినిని అపహరించి అత్యాచారం చేసిన కేసులో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాజీ ఎమ్మెల్యే యోగేంద్ర సాగర్‌కు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్షతో పాటు అతనికి రూ.30,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్‌లోని బిల్సీ నుండి 2008 ఏప్రిల్ 23న ఇరవై ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిని అపహరించి, ఆ తర్వాత ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినందుకు న్యాయమూర్తి అఖిలేష్ కుమార్ అతన్ని దోషిగా నిర్ధారించారని అదనపు ప్రభుత్వ న్యాయవాది మదన్‌లాల్ రాజ్‌పుత్ తెలిపారు. నేరం రుజువు కావడంతో అతనికి శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వైద్య, కోవిడ్ పరీక్షల కోసం తీసుకెళ్లారు. యోగేంద్ర సాగర్ సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఇప్పటి వరకు బయట ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో ఆయన బుదౌన్ జిల్లాలోని బిల్సీ స్థానం నుంచి బీఎస్పీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలోనే కాలేజీ యువతిపై అఘాయిత్యానికి పాల్పడట్లు పోలీసులు తేల్చారు. పోలీసుల విచారణలో, సాగర్ తనను లక్నోలోని తన ప్రభుత్వ నివాసంలో ఉంచాడని, అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని యువతి వాంగ్మూలం ఇచ్చింది. అపహరణ తర్వాత తనను ఢిల్లీతో సహా పలు ప్రాంతాలకు తీసుకెళ్లారని, ఆ ముగ్గురూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె చెప్పారు.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. పదమూడేళ్ల పాటు విచారణ జరపిన ప్రత్యేక కోర్టు యోగేంద్ర సాగర్‌ను దోషిగా నిర్ధారించి శిక్ష ఖరారు చేసింది. కాగా, ఈ కేసుకు సంబంధించి మిగిలిన ఇద్దరు తేజేంద్ర సాగర్, నీరజ్ అలియాస్ మిను శర్మలకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం, యోగేంద్ర సాగర్ భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. అతని కుమారుడు కుశాగ్ర సాగర్ బిసౌలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. భార్య ప్రీతి జిల్లా పంచాయతీకి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.
Read Also… Yashika Aannand : సరదాలకు పోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్న యాషిక కోలుకుంటుంది.. కానీ