Encounter: అడవిలో తుపాకుల మోత.. పోలీసులకు.. మావోయిస్టులకు ఎదురు కాల్పులు.. ముగ్గురు మహిళా మావోల మృతి
Encounter: అడవిలో తుపాకుల మోత మోగింది. ఒకరిపై ఒకరు బుల్లెట్ల వర్షం కురిపించుకున్నారు. ఈ మధ్య కాలంలో భారీగా కదలికలు కొనసాగుతున్న..
Encounter: అడవిలో తుపాకుల మోత మోగింది. ఒకరిపై ఒకరు బుల్లెట్ల వర్షం కురిపించుకున్నారు. ఈ మధ్య కాలంలో భారీగా కదలికలు కొనసాగుతున్న మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇక మావోయిస్టులకు అడ్డగా ఉండే ప్రాంతం ఛత్తీస్‌గఢ్. ఈ ప్రాంతాన్ని అడ్డగా మార్చుకున్న మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు ప్రతి నిత్యం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇక తాజాగా దంతెవాడ జిల్లాలో పోలీసులకు – మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మృతులు రాజే ముచికి (సుకుమా జిల్లా కుకునార్), గీత మార్కం (సుకుమా జిల్లా చింతల్ నార్), జ్యోతి నుప్పో (రేవాలి అరన్పూర్)గా గర్తించారు పోలీసులు.
అయితే ఒక్కొక్కరిపై రూ.5 లక్షల చొప్పున రివార్డు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో బోర్ రైఫిల్, రెండు నాటు తుపాకులు, ఐఈడీ వైర్, మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంకా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇలా ఈ ప్రాంతంలో ఎన్నో ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఎంతో మంది మావోయిస్టులు హతమవుతున్నారు. అయినా ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. దీంతో ప్రత్యేక పోలీసులు బలగాలు కూడా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇటీవల మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతితో మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బేనని చెప్పాలి.
ఇవి కూడా చదవండి: