Tesla Car: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. రోడ్డుపై చక్కర్లు కొడుతున్న టెస్లా ఎలక్ట్రిక్‌ కారు.. మార్కెట్లో సందడి చేయనున్న వాహనాలు

Tesla Car: ప్రస్తుతం ఇంధన ధరలు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. అందుకు వాహనదారులు కూడా వాటివైపే..

Tesla Car: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. రోడ్డుపై చక్కర్లు కొడుతున్న టెస్లా ఎలక్ట్రిక్‌ కారు.. మార్కెట్లో సందడి చేయనున్న వాహనాలు
Follow us
Subhash Goud

|

Updated on: Oct 31, 2021 | 9:22 PM

Tesla Car: ప్రస్తుతం ఇంధన ధరలు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. అందుకు వాహనదారులు కూడా వాటివైపే ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొన్ని స్కూటర్లు అందుబాటులో రాగా, కొన్ని ఎలక్ట్రిక్‌ కార్లు కూడా మార్కెట్లోకి రానున్నాయి. ఇక త్వరలో భారత్‌లో ప్రముఖ ఎలక్ట్రిక్‌ టెస్లా కార్లు రోడ్డెక్కనున్నాయి. టెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ టెస్లా-3, టెస్లా-Y మోడల్‌ కార్లను ఈ సంవత్సరం చివరి నాటికి భారత్‌లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌ కార్లతో ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న టెస్లా భారత్‌ మార్కెట్‌ పై కన్నేసింది. ఈ నేపథ్యంలో టెస్లా మోడల్ వై కారును హిమాచల్ ప్రదేశ్ రోడ్లపై టెస్ట్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్లా మోడల్ 3 కారు ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో కారును పరీక్షించింది. దీనిపై మొదట టీమ్-బిహెచ్ పీ నివేదించింది.

షోరూమ్‌లు, డీలర్‌షిప్‌ల ఏర్పాటుకు టెస్లా సిద్ధం..

ఇక భారత్‌లో విలాసవంతమైన కార్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు షోరూంలను, డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసేందుకు టెస్లా రెడీ అవుతోంది. ఇప్పటికే బెంగళూరు కేంద్రంగా టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో రిజిస్టర్‌ చేయించింది. దీంతో పాటు ముంబై ప్రధాన కార్యాలయంగా.. కొన్ని ప్రధాన నగరాల్లో డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసి ఈ ఏడాది చివరి నాటికి ఈ కార్లను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ కారు కేవలం 3.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంటుంది. దీని గరిష్ట వేగం 250 కిలోమీటర్లు. ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 487 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని తెలుస్తోంది. మోడల్ వై ధర రూ.70 లక్షల నుంచి(ఎక్స్ షోరూమ్). ఇలా ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ పోటీ నెలకొనడంతో ఈవీ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి పలు వాహనాల కంపెనీలు.

ఇవి కూడా చదవండి:

Post Office Franchise: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ బెనిఫిట్‌..

Kawasaki Bike: భారత మార్కెట్లోకి కవాసకి జెడ్ 650 ఆర్‌ఎస్‌ బైక్..అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే..

అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
"వితౌట్ ఐస్'' అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..