- Telugu News Photo Gallery Business photos Kawasaki launches MY22 Z650RS in India. Know its price and delivery
Kawasaki Bike: భారత మార్కెట్లోకి కవాసకి జెడ్ 650 ఆర్‌ఎస్ బైక్..అదిరిపోయే ఫీచర్స్.. ధర ఎంతంటే..
Kawasaki Bike: జపనీస్టూవీలర్ కంపెనీ కవాసకి భారత మార్కెట్‌లోకి ఓ కొత్త 650 సీసీ క్లాసిక్ బైక్విడుదల చేసింది. కవాసకి MY22 Z650RS పేరుతో దీనిని ఆవిష్కరించింది. ఈ కొత్త బైక్..
Updated on: Oct 30, 2021 | 9:36 PM

Kawasaki Bike: జపనీస్టూవీలర్ కంపెనీ కవాసకి భారత మార్కెట్‌లోకి ఓ కొత్త 650 సీసీ క్లాసిక్ బైక్విడుదల చేసింది. కవాసకి MY22 Z650RS పేరుతో దీనిని ఆవిష్కరించింది. ఈ కొత్త బైక్ రూ. 6.65 లక్షల ధర ఉంది. ఇప్పటికే మార్కెట్‌లో లభిస్తున్న ట్రయంఫ్ట్రేడియంట్ 660, హోండా సీబీ 650 ఆర్, హోండా జెడ్ 650 వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Z650RS క్యాండీ ఎమరాల్డ్ గ్రీన్, మెటాలిక్ మూన్‌డస్ట్ గ్రే కలర్ఆప్షన్లలో ఇది లభిస్తుంది. ఇప్పటికే వీటి ప్రీబుకింగ్స్ ప్రారంభం కగా, నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్‌లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ మోడల్‌లో మునుపటి మోడల్మాదిరిగానే 649 సిసి ప్యార్లల్ట్విన్ ఇంజిన్‌ను సంస్థ అందించింది.

ఈ ఇంజిన్8,000 ఆర్పిఎమ్వద్ద 67 బీహెచ్‌పీ శక్తిని, 6,700 ఆర్పిఎమ్వద్ద 64 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌లో స్లిప్పర్క్లచ్తో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను కూడా అందించింది.

కొత్త కవాసకి జెడ్650 బైక్ 41 మిమీ టెలిస్కోపిక్ఫోర్కులను చేర్చింది. ఈ బైక్ వెనుక భాగంలో 130 మిమీ మోనోషాక్ సెటప్‌ను అందించింది. వీటితో పాటు అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది సంస్థ.





























