నగర శివారులో పేకాట క్లబ్.. నడిపిస్తున్నది ఎవరో తెలిస్తే షాకవుతారు.. పోలీసుల విచారణలో సంచలన నిజాలు
హైదరాబాద్ శివారులో పేకాట దందా జోరుగా కొనసాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ కేంద్రంగా సాగుతోన్న ఈ దందా గుట్టురట్టయ్యింది..
హైదరాబాద్ శివారులో పేకాట దందా జోరుగా కొనసాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ కేంద్రంగా సాగుతోన్న ఈ దందా గుట్టురట్టయ్యింది. పక్కా ఆధారాలతో టీవీ9 పట్టుకుంది. ఎస్‌ఓటీ పోలీసులతో కలిసి టీవీ9 ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించి బట్టబయలు చేసింది. మంచిరేవుల ప్రాంతంలో ఓ టాలీవుడ్ యువ నటుడి ఫామ్‌హౌస్‌లో ఈ పేకాట స్థావరాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడొక పేకాట క్లబ్ నడుపుతున్నట్లు పక్కా సమాచారంతో టీవీ9 , సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పేకాట క్లబ్ బండారాన్ని బయట పెట్టింది. ఒకరిద్దరు కాదు.. బెజవాడ- కర్నూల్- నిజామాబాద్- మహబూబా బాద్ జిల్లాల నుంచి.. పాతిక మంది వరకు ఇందులో పాల్గొని భారీ ఎత్తున డబ్బులు పెట్టి ఈ దందా నిర్వహిస్తున్నట్లు తేలింది. అంతేకాదు.. ఈ ఆపరేషన్‌లో రూ.6 లక్షల 77 వేల నగదు, 34 మొబైళ్లు, ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తెరపై వరుడు కావలెను.. మరి తెర బయట..
ఇంతకీ ఈ వ్యవహారంలో కీ రోల్ ఎవన్నది ఆరా తీస్తే ఓ వ్యక్తి పేరు బయట పడింది. మొత్తం పేకాటలో సూత్రదారి యంగ్ హీరో నాగశౌర్యం అని తేలడం సంచలనంగా మారింది. తెరపై వరుడు కావలెను.. తెర బయట జూదగాళ్లుగా నాగశౌర్య వ్యవహారంగా తెలుస్తోంది. అయితే బేసిగ్గా చెప్పాలంటే ఇదొక ఐఏఎస్ అధికారికి చెందిన ఫామ్ హౌజ్. దీనిని నాగశౌర్య ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్నట్టు గుర్తించారు పోలీసులు. లీజుకు తీసుకున్న ఇంట్లోనే నాగశౌర్యం ఇలాంటి షో నడిపిస్తున్నాడు. అయితే వీకెండ్ వచ్చిందంటే చాలు ఏపీ నుంచి కూడా ప్రముఖులు వస్తున్నట్లు తేలింది. క్లబ్ నిర్వాహుకుడు సుమంత్ చౌదరిగా గుర్తించారు పోలీసులు. ఈ జాయింట్ ఆపరేషన్‌లో 25 మంది వరకు అదుపులో తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు రాబడుతున్నారు పోలీసులు.
ఇవి కూడా చదవండి: