శివారులో షాకింగ్ సీన్.. జూదశాలగా మారిన ఓ యువ హీరో ఫామ్‌హౌస్‌‌.. అతడు ఎవరంటే..?

హైదరాబాద్‌ శివారులో మహా దందా నడుస్తోంది. వీకెండ్ వస్తే మస్తీ కేంద్రంగా మారిపోతోంది. నో డౌట్. అందుకు సంబంధించిన పక్కా ఆధారం టీవీ9 పట్టుకుంది.

శివారులో షాకింగ్ సీన్.. జూదశాలగా మారిన ఓ యువ హీరో ఫామ్‌హౌస్‌‌.. అతడు ఎవరంటే..?
Gambling
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 01, 2021 | 8:53 AM

హైదరాబాద్‌ శివారులో మహా దందా నడుస్తోంది. వీకెండ్ వస్తే మస్తీ కేంద్రంగా మారిపోతోంది. నో డౌట్. అందుకు సంబంధించిన పక్కా ఆధారం టీవీ9 పట్టుకుంది. ఎస్‌ఓటీ పోలీసులతో కలిసి టీవీ9 చేసిన ఈ జాయింట్ ఆపరేషన్‌లో ఔరా అనిపించే రేంజ్‌లో జరుగుతున్న పేకాట క్లబ్‌ బట్టబయలైంది. మంచిరేవుల ప్రాంతంలో ఓ టాలీవుడ్ యువ నటుడి  ఫామ్‌హౌస్‌‌లో ఈ బాగోతం జరుగుతోంది.  ఈ ఫామ్‌హౌస్‌కే.. సిటీలోని సెలబ్రిటీలు, ప్రముఖులతో పాటు ఏపీ నుంచీ అనేక మంది ప్రముఖులు వస్తుంటారు. హై ఎండ్ కార్లేసుకుని విలాసపురుషుల్లా దిగిపోతుంటారు. లక్షలు కోట్లు కుమ్మరించి రేయింబవళ్లు పేకాడుతూనే ఉంటారు. అందుకు సంబంధించిన ఆధారాలు టీవీ9 ఎక్స్‌క్లూజీవ్‌గా సంపాదించింది.

సాధారణంగా పేకాట అంటే మూడుముక్కలో, 13 ముక్కలో అనుకుంటాం. కానీ.. ఇక్కడ ఆడుతున్న ఆ ఆటలో టెక్నాలజీనే అదుర్స్‌. క్యాసినోను తలపించే రేంజ్‌లో జరుగుతుంది బిజినెస్ ఇక్కడ. స్వైపింగ్ మిషీన్లున్నాయి. చిప్స్‌తో ఆట నిర్వహణ జరుగుతోంది. అక్కడ కనిపించిన ఎక్విప్‌మెంట్ చూసి పోలీసులే కంగుతిన్నారు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. నాగ శౌర్య. ఈ డెన్‌కి సంబంధించి పైకి పాత్రధారి సుమంత్ చౌదరిగా గుర్తించారు పోలీసులు. అక్కడ 6 లక్షల క్యాష్, స్వైపింగ్ మిషన్లు, కార్లు సీజ్ చేశారు. 25 మంది విలాసపురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది నాగ శౌర్య సొంత ఇల్లు కూడా కాదు.. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నుంచి ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్నాడని తెలుస్తోంది. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా.. ఎందరో ప్రముఖులు.. రాజకీయ- వ్యాపార- రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన బిగ్ షాట్స్.. వీకెండ్ వస్తే చాలు వాలిపోయేలా చెబుతున్నారు స్థానికులు.

Naga Shourya

Also Read: Unstoppable with NBK.. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అతిథుల లిస్ట్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. తారక్ కూడా !

Hyderabad: పెళ్లితో ఏకమవ్వనున్న ఇద్దరు పురుషులు.. తెలంగాణలో ఇదే ఫస్ట్ టైమ్ !

ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో