Unstoppable with NBK.. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అతిథుల లిస్ట్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. తారక్ కూడా !
నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అన్‌స్టాపబుల్ విత్ NBK పేరుతో ఆయన ఓటీటీ వేదికగా గర్జించనున్నారు.
నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అన్‌స్టాపబుల్ విత్ NBK పేరుతో ఆయన ఓటీటీ వేదికగా గర్జించనున్నారు. అసలు బాలయ్య ఓటీటీ ఎంట్రీ ఇవ్వడమే ఒక సెన్సేషన్. ఈ ప్రకటనతో అటు నందమూరి అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకులు సైతం ఈ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మోహన్ బాబు ఈ షో ఫస్ట్ గెస్ట్ అని తాజా ప్రోమోని బట్టి అర్థమవుతోంది. మోహన్ బాబుతో పాటు విష్ణు, మంచు లక్ష్మీ సైతం ఈ షోలో పాల్గొన్నారు. ప్రోమో అయితే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బాలయ్య నయా అవతార్‌ను ఆయన ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని రకాల భావోద్వేగాలు ఈ షోలో మిళితం కానున్నాయని ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. అయితే బాలయ్య అభిమానులను తొలుస్తోన్న ఓ ప్రశ్న.. తదుపరి ఎపిసోడ్‌లకు ఎవరు అతిథులుగా రాబోతున్నారు అని. యస్.. ఇప్పుడు నెట్టింట ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఆహా టీమ్ వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అతిథులు లిస్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.
రెండవ ఎపిసోడ్ అతిథి బల్లాల దేవ రానా అని తెలుస్తోంది. ఆ తర్వాత నాని అట. ఇప్పటికే ఈ రెండు ఎపిసోడ్ల చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ షో ఫస్ట్ సీజన్‌ను సంచలనంగా మార్చేందుకు అల్లు అరవింద్ రంగంలోకి దిగారట. అందుకే తదుపరి ఎపిసోడ్స్ కోసం నందమూరి చిన్నోడు ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట. అల్లు అరవింద్ అడిగితే కాదనే వారు ఎవరు ఉంటారు చెప్పండి. అందుకే రాబోయే ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌కు ఫీస్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా యంగ్ టైగర్ తారక రామారావు గెస్ట్, బాలయ్య హోస్ట్ అనే విషయం ఊహించుకుంటేనే అభిమానుల మనసులు ఉప్పొంగుతాయి. ఇక ఇది కార్యరూపం దాల్చితే నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి.
Also Read: ‘డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా’.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె