AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Balakrishna Unstoppable : అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. అదరగొట్టిన బాలయ్య..

నటసింహం నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అయ్యారు. బాలయ్య హోస్ట్ గా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఓ టాక్ షోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Nandamuri Balakrishna Unstoppable : అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. అదరగొట్టిన బాలయ్య..
Aha
Rajeev Rayala
|

Updated on: Oct 31, 2021 | 3:20 PM

Share

Nandamuri Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అయ్యారు. బాలయ్య హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఓ టాక్ షోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్ షో కు అన్ స్టాపబుల్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. సరికొత్త కంటెంట్ చిత్రాలను.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏లను అందిస్తూ విజయవంతగా దూసుకుపోతుంది తొలి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. అంతేకాకుండా.. గేమ్ షోస్.. టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ.. ఇతర ఓటీటీ ప్లాట్‏ఫాంలకు గట్టిపోటీనిస్తుంది. అయితే గతంలో సమంతతో సామ్ జామ్ అనే టాక్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు మొదటి గెస్ట్ గా కలక్షన్ కింగ్ మోహన్ బాబు గెస్ట్ గా హారాజారయ్యారు. తాజాగా మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు ఆహా టీమ్. తనదైన మాటలతో మోహన్ బాబును తికమక పెట్టారు బాలయ్య.

నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు  అంటూ అదిరిపోయే డైలాగ్ తో ప్రోమో మొదలైంది. ఆతర్వాత మోహన్ బాబును ఆహ్వానించారు బాలయ్య. ఈ ఇద్దరి మధ్య సంభాషణ చాలా సరదాగా సాగింది. ఇంకా కుర్రాడిలా ఉన్నారేంటి అంటూ బాలయ్య మోహన్ బాబును అడగ్గా.. ఎవరికీ వయసు నీ వయసెంత అని తిరిగి మోహన్ బాబు అడిగారు.. దానికి బాలయ్య 16 ఏళ్ళు అంటూ నవ్వులు పూయించారు. మీరు నటించిన సినిమాల్లో మీరు చేసుకోలేని సినిమా ఏంటి అని బాలయ్య అగడ్డగా ‘పటాలం పాండు’ అనే సినిమా అన్నారు. దానికి బాలకృష్ణ అంత రాడ్డు రంబోలా నా.. అంటూ నవ్వేశారు బాలయ్య. ఆ తర్వాత మోహన్ బాబు సినీ కెరీర్ గురించి ప్రశ్నించగా ఎమోషనల్ అయ్యారు మోహన్ బాబు. చివరిలో మంచు విష్ణు, లక్ష్మీ ప్రసన్న షోలో హాజరయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణంపై భావోద్వేగానికి గురైన బన్నీ, విజయ్‌.. ఏమన్నారంటే..

Rajamouli: ప్రభాస్‌తో పోటీపై స్పందించిన రాజమౌళి.. జక్కన్న ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా.?

Minnal Murali : సూపర్ హీరో కథతో రాబోతున్న ‘మిన్నల్ మురళి’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్