AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun and Vijay Devarakonda: ఐకాన్ స్టార్ అండ్ రౌడీ హీరో… ఇద్దరికీ అదొక్కటే మ్యూచ్యువల్ టార్గెట్!!

మొట్టమొదటి అచ్చతెలుగు డిజిటల్ డయాస్ ఆహా.. మరో టర్న్ తీసుకోబోతోంది. ఆహా 2.O పేరుతో కొత్త జర్నీ షురూ కాబోతోంది.

Allu Arjun and Vijay Devarakonda: ఐకాన్ స్టార్ అండ్ రౌడీ హీరో... ఇద్దరికీ అదొక్కటే మ్యూచ్యువల్ టార్గెట్!!
Aha
Rajeev Rayala
|

Updated on: Oct 31, 2021 | 7:31 PM

Share

Aha: మొట్టమొదటి అచ్చతెలుగు డిజిటల్ డయాస్ ఆహా.. మరో టర్న్ తీసుకోబోతోంది. ఆహా 2.O పేరుతో కొత్త జర్నీ షురూ కాబోతోంది. నవంబర్ 2 సాయంత్రం అట్టహాసంగా జరిగే ఈవెంట్లో ఆహా సెకండ్ వెర్షన్ డీటెయిల్స్ రివీల్ చెయ్యబోతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ అప్పియరెన్స్ తో ఆ వేడుక అదరహో రేంజ్ లో వుండబోతోంది. దీపావళి సందడిని ముందే ఆవిష్కరించే స్థాయిలో ఏర్పాట్లు ఉండబోతున్నాయి.

ఆహా లాంచింగ్ టైమ్ లో కూడా అల్లు అర్జున్ ఫ్లేవర్ బాగా పనిచేసింది. యాప్ రీచ్ ర్యాపిడ్ గా పెరిగింది. డౌన్లోడ్స్ అండ్ సబ్ స్క్రిప్షన్స్ లెక్క అంచనాల్ని టచ్ చేసింది. ప్రమోటర్ గా విజయ్ దేవరకొండ పెట్టిన ఎఫర్ట్స్ కూడా వర్కవుట్ అయ్యాయి. ‘లైఫ్ లో కొంచం ఆహా ఉండాలె’ అనే థీమ్ తో రౌడీ స్టార్, ఐకాన్ స్టార్ ఇద్దరూ చేసిన ప్రోమోలు క్లాస్ అండ్ మాస్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. రూరల్ పాకెట్స్ లో కూడా ఆహాకు ఫాలోయర్లను పెంచేశాయి.

ఇప్పుడు కొత్త సినిమాలతో పాటు సరికొత్త జానర్స్ తో రూపొందిస్తున్న ఒరిజినల్స్… అన్నీ కలిపి మరింత నిండుగా మారింది ఆహా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రొమాంటిక్, వరుడు కావలెను లాంటి క్రేజీ మూవీస్ ఒకవైపు… బాలయ్య మెయిడెన్ టాక్ షో అన్ స్టాపబుల్ మరోవైపు… ఆహా ఆడియెన్స్ ని ఈగర్ గా వెయిట్ చేయిస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని సర్‌ప్రైజెస్‌ని కూడా కలిపి.. ఆహా 2.O పేరుతో కొత్త బొకే అనౌన్స్ కాబోతోంది. నవంబర్ 2న ఐకాన్ స్టార్ చీఫ్ గెస్ట్ గా జరిగే వేడుక… ఆహా 2.O కిక్ స్టార్ట్ కి అసలైన వేదిక.

(Srihari Raja, ET, TV9)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ramya Krishnan: చిన్నాపెద్దా అన్ని సినిమాలకు కమర్షియల్ ఎలిమెంట్‌గా ఎవర్‌ గ్రీన్ క్వీన్

Puneeth Rajkumar: 13 ఏళ్ళ తర్వాత డీపీ మార్చిన హీరో.. ప్రాణ స్నేహితుడికి ఇంతకన్నా నివాళి ఉంటుందా.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు..