Ramya Krishnan: చిన్నా పెద్దా అన్ని సినిమాలకు కమర్షియల్ ఎలిమెంట్‌గా ఎవర్‌ గ్రీన్ క్వీన్

జనరేషన్లు మారినా.. జానర్లు మారినా.. ఆమె పెర్ఫామెన్స్‌కి మాత్రం ఎవ్వరైనా ఫిదా కాక తప్పేలా లేదు. దశాబ్దాల తరబడి తరగని ఇమేజ్‌తో.. కటౌట్ సైజు పెంచుకుంటూ వెళుతున్న ఆమె ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ కేక్.

Ramya Krishnan: చిన్నా పెద్దా అన్ని సినిమాలకు కమర్షియల్ ఎలిమెంట్‌గా ఎవర్‌ గ్రీన్ క్వీన్
Ramya Krishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 31, 2021 | 6:43 PM

Ramya Krishnan: జనరేషన్లు మారినా.. జానర్లు మారినా.. ఆమె పెర్ఫామెన్స్‌కి మాత్రం ఎవ్వరైనా ఫిదా కాక తప్పేలా లేదు. దశాబ్దాల తరబడి తరగని ఇమేజ్‌తో.. కటౌట్ సైజు పెంచుకుంటూ వెళుతున్న ఆమె ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ కేక్. ఇంతకీ ఎవరామె? సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. సినిమా లైనప్ తోనే కాదు.. రెమ్యునరేషన్ విషయంలోనూ, రెగ్యులర్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా దీటుగా నిలబడుతున్నారామె.

ఇరవయ్యేళ్ల కిందట నీలాంబరిగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో సరిసమానం అనిపించి… సౌత్‌లో బిగ్గర్ సౌండిచ్చిన హీరోయిన్ రమ్యక్రిష్ణ. ఆ తర్వాత బాహుబలిలో శివగామిగా పాన్ ఇండియా రేంజ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ దక్కించుకున్నారు. చిన్న గ్యాప్ ఇచ్చినా… ఇప్పటికీ… చేసే ప్రతీ సినిమానూ ఒక సాలిడ్ కమర్షియల్ ఎలిమెంట్ అవుతున్నారు రమ్యకృష్ణ. మంచి మల్టి లింగువల్ మార్కెట్ వున్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా రమ్యకృష్ణ కాల్షీట్ రేట్ కూడా రాకెట్ లా దూసుకుపోతోంది.

రిపబ్లిక్‌ మూవీలో మినిస్టర్ విశాఖవాణిగా పొలిటీషియన్‌ గెటప్‌లో మంచి మార్కులు కొట్టేశారు రమ్యకృష్ణ. హీరో సాయి ధరమ్ తేజ్ అయినా… కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. లేటెస్ట్‌గా.. పూరి డీల్ చేసిన రొమాంటిక్ మూవీలో పోలీసాఫీసర్‌గా చెలరేగిపోయారు. ఈ బోల్డ్ లవ్‌స్టోరీలో రమ్యక్రిష్ణ పాత్రే సెంట్రల్ పాయింట్. పూరి అండ్ రౌడీ కాంబోలో రాబోయే పాన్ ఇండియా మూవీ లైగర్‌లో హీరోకి తల్లి పాత్రలో కనిపిస్తున్నారు. పూరి సినిమాల్లో మదర్‌ సెంటిమెంట్‌కుండే ప్రయారిటీయే వేరు కనుక లైగర్ కూడా ఆమె స్పెషల్ ఎసెట్ అవుతారు.

భర్త క్రిష్ణవంశీ ప్రిస్టీజియస్‌గా భావించి తీస్తున్న రంగమార్తాండలో కూడా రమ్యదే కీ రోల్‌. ఇలా సీరియస్ రోల్స్‌లోనే కాదు.. రొమాంటిక్ జానర్ లో కూడా ఆమె దగ్గర అదే సీనియారిటీ కనిపిస్తుంది. సోగ్గాడే చిన్నినాయనాతో సక్సెస్ కొట్టిన బంగార్రాజు ఏరికోరి సీక్వెల్‌లో కూడా రమ్యక్రిష్ణనే పిక్ చేసుకున్నారు. గ్లామర్ ఐకాన్ అనే ట్యాగ్‌ పోగొట్టుకోకుండా… శివగామి ఫ్లేవర్‌ని మిస్సవకుండా… చిన్నాపెద్దా అన్ని సినిమాలకు కమర్షియల్ ఎలిమెంట్ అవుతున్నారు ఈ ఎవర్‌ గ్రీన్ క్వీన్ ఆఫ్ టాలీవుడ్. బండి ఇదే స్పీడ్ తో నడిస్తే… గోల్డెన్ హ్యాండ్ అని పేరుబడితే… రమ్యకి కోటి ఇవ్వడానిక్కూడా వెనక్కు తగ్గేలా లేరు నిర్మాతలు.

Srihari Raja, ET, TV9

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ravi Teja: జోరు పెంచిన మాస్ మహారాజ్.. తాజాగా మరో సినిమాను లైన్ లో పెట్టిన రవితేజ..

Puneeth Rajkumar: 13 ఏళ్ళ తర్వాత డీపీ మార్చిన హీరో.. ప్రాణ స్నేహితుడికి ఇంతకన్నా నివాళి ఉంటుందా.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు..

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.