Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు..

బిగ్ బాస్ హౌస్‌లో సంబరాలు రెట్టింపు అయ్యాయి. మాములుగా శని ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ లో జోష్ మరింత పెంచుతుంటారు.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు..
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 31, 2021 | 3:54 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో సంబరాలు రెట్టింపు అయ్యాయి. మాములుగా శని ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్‌లో జోష్ మరింత పెంచుతుంటారు. ఈ సారి దీపావళి సంబరాలు బిగ్ బాస్ హౌస్‌లో సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా ఈ ఎపిసోడ్స్‌కు సంబంధించిన ప్రోమోలు విడుదల చేశారు. దీపావళి సందర్భంగా బిగ్ బాస్ స్టేజ్ పైకి సినిమా తారలతో పాటు గత సీజన్ కంటెస్టెంట్స్ కూడా హడావిడి చేశారు. ముఖ్యంగా హీరోయిన్ శ్రియ, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. అందాల భామలు అవికా గోర్, మోనాల్, దివి తమ డాన్స్ లతో ఆకట్టుకున్నారు. సింగర్ కల్పనా అందమైన పాటలతో అలరించారు.

ఇక స్టార్ యాంకర్ సుమ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి హల్ చల్ చేశారు. కరోనా కారణంగా అద్దాల రూమ్‌లోనే ఉంది హోస్ మేట్స్‌ను పలకరించారు సుమ. హౌస్ మేట్స్ పై తనదైన స్టైల్ లో పంచులు వేసింది సుమ. అలాగే గత సీజన్ కంటెస్టెంట్స్ అయిన అవినాష్, బాబా మాస్టర్ కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతంలో హౌస్‌లో ఉన్న సభ్యులు ఎలా చేస్తున్నారు చేసి చూపించారు అవినాష్- బాబా మాస్టర్. అలాగే సోహెల్- అరియనా కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ స్టేజ్ పై మంచి రోజులొచ్చాయి సినిమా టీమ్ మారుతి, సంతోష్ శోభన్, మెహ్రీన్ కూడా సందడి చేశారు. వీటికి సంబంధించిన ప్రోమోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ వారం హౌస్ నుంచి ఒకరు బయటకు వెళ్లనున్నారు. తాజాగా అందుతున్న సమాచారం పరికరం ఈ వారం లోబో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి :

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!