AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar: 13 ఏళ్ళ తర్వాత డీపీ మార్చిన హీరో.. ప్రాణ స్నేహితుడికి ఇంతకన్నా నివాళి ఉంటుందా..

పునీత్ మరణ వార్తను కన్నా సినిమా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా తన సేవ గుణంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు పునీత్ రాజ్ కుమార్.

Puneeth Rajkumar: 13 ఏళ్ళ తర్వాత డీపీ మార్చిన హీరో.. ప్రాణ స్నేహితుడికి ఇంతకన్నా నివాళి ఉంటుందా..
Puneeth Raj Kumar
Rajeev Rayala
|

Updated on: Oct 31, 2021 | 4:53 PM

Share

Puneeth Rajkumar: పునీత్ మరణ వార్తను సినిమా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా తన సేవ గుణంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు పునీత్ రాజ్ కుమార్. పునీత్ హఠాన్మరణంతో సినీ లవర్స్ శోకసంద్రంలో మునిగిపోయింది. పునీత్ మరణ వార్త విని అన్నీ ఇండస్ట్రీల స్టార్ ఆయనకు నివాళ్లు అర్పించారు. పునీత్‌కు కన్నడ ఇండస్ట్రీతోపాటు అన్నీ ఇండస్ట్రీలోనూ మంచు స్నేహితులు ఉన్నారు. ఇక కన్నడ ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో పునీత్‌కు మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. పునీత్‌కు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో సుధీప్ కిచ్చా ఒకరు. పునీత్ సుదీప్ నాలుగు దశాబ్దాలనుంచి స్నేహితులు. ఈ ఇద్దరి మధ్య ఎంతో మంచి స్నేహం ఉంది. అయితే పునీత్ మరణంతో సుదీప్ శోకసంద్రంలో మునిగిపోయారు.

సోషల్ మీడియా వేదికగా పునీత్ మరణం పై స్పందించారు. పునీత్ గురించి సుదీర్ఘమైన లేఖను రాసి సోషల్ మీడియాలో సుదీప్ పోస్ట్ చేశాడు. అందులో మొదటి సారి నిన్ను శివ మొగ్గలో కలిశాను. ఆ సమయంలోనే మనం మంచి స్నేహితులం అయ్యాం. అప్పటికే నువ్వు బాల నటుడిగా చాలా సినిమాలు చేసి స్టార్ అయ్యావు. నీతో కలిసిన ప్రతి సందర్బం నాకు చాలా ప్రత్యేకమైనది అని రాసుకొచ్చాడు సుదీప్. సుదీప్ ట్విట్టర్‌లోకి వచ్చి దాదాపు 13 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుండి కూడా సుదీప్ తన ట్విట్టర్ అకౌంట్ డీపీని మార్చకుండా అలాగే ఉంచాడు. ఇప్పుడు తన ప్రాణ స్నేహితుడు తననుంచి దూరం అవ్వడంతో భావోద్వేగానికి గురైన సుదీప్.. 13 ఏళ్ల తర్వాత తన డీపీని మార్చాడు. పునీత్ ఫోటోను డీపీగా పెట్టాడు.Sudeep

Sudeep

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు..

Nandamuri Balakrishna Unstoppable : అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. అదరగొట్టిన బాలయ్య..

Regina Cassandra: తన అందాలతో కుర్రగుండెల్లో గిలిగింతలు పెడుతున్న రెజీనా..