Hyderabad: పెళ్లితో ఏకమవ్వనున్న ఇద్దరు పురుషులు.. తెలంగాణలో ఇదే ఫస్ట్ టైమ్ !

ఇద్ద‌రు పురుషులు లేదా ఇద్ద‌రు స్త్రీలు పెళ్లి చేసుకున్న ఘటనలు మనం అక్కడక్కడా వింటూనే ఉన్నాం. అయితే హైదరాబాద్‌లో అలాంటి వివాహం జరగబోతుంది.

Hyderabad: పెళ్లితో ఏకమవ్వనున్న ఇద్దరు పురుషులు.. తెలంగాణలో ఇదే ఫస్ట్ టైమ్ !
Gay Couple
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 31, 2021 | 4:36 PM

ఇద్ద‌రు పురుషులు లేదా ఇద్ద‌రు స్త్రీలు పెళ్లి చేసుకున్న ఘటనలు మనం అక్కడక్కడా వింటూనే ఉన్నాం. అయితే హైదరాబాద్‌లో అలాంటి వివాహం జరగబోతుంది. అవును, ఇద్దరు పురుషులు దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రజంట్ సొసైటీలో వివాహాలకు లింగ భేదం అడ్డు రావడం లేదు. మనసుకు ఎవరు నచ్చితే వారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి పెళ్లిళ్లు ఎక్కువగా విదేశాల్లో జరిగినట్లు మనం విన్నాం. అయితే హైదరాబాద్ కి చెందిన సుప్రియో, అభయ్ అనే ఇద్దరు యువకులు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. 2013 లో ఒక డేటింగ్ యాప్ వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరి మనసులోని భావాలు కలవడంతో వారి మధ్య స్నేహం కుదిరింది. అనంతరం అది ప్రేమగా మారింది. ఎనిమిదేళ్ల పాటు సహజీవనం చేశారు. ఈ క్రమంలో వారీ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలని డిసైడ్ అయ్యారు. పెళ్లి చేసుకుంటామని ఇరు కుటంబాల పెద్దల్ని అప్రోచ్ అయ్యారు. వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.

ఈ డిసెంబర్ లో వీరి వివాహం జరగనుంది. పెద్దల గురించే భయముండేదని.. ఇప్పుడు వారిని ఒప్పించడంతో ఆనందాలకు అవధులు లేవని వారు చెబుతున్నారు. ఇక ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవడం తెలంగాణలో ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. అందరి పెళ్లిళ్లు లానే తమ వివాహంలోనూ మంగళ స్నానాలు, నిశ్చితార్థం, సంగీత్, ఉంగరాలు మార్చుకునే కార్యక్రమాలు ఉంటాయని ఈ ప్రేమ జంట వెల్లడించారు.

Also Read: ‘డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా’.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌