Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: భార్యే భర్తను చంపింది.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి..

Wife, lover held for man’s murder: ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలుసుకున్న భర్త ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. చివరకు

Crime News: భార్యే భర్తను చంపింది.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 31, 2021 | 1:57 PM

Wife, lover held for man’s murder: ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలుసుకున్న భర్త ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. చివరకు భర్తను ఇంటికి పిలిచి ప్రియుడు, మరో ఇద్దరి సహాయంతో చంపింది. హైదరాబాద్ నగరంలో ఈనెల 19న అర్ధరాత్రి జరిగిన డెయిరీ వ్యాపారి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మృతుడి భార్య సహా అయిదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పహడీషరీఫ్‌ పోలీసులు తెలిపారు. భార్యే ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ కేసు వివరాలు వెల్లడించారు. హత్యకేసులో మృతుడి భార్య, ఆమె ప్రియుడితో పాటు హత్యకు సహకరించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్, శివరాంపల్లికి చెందిన షేక్‌ ఆదిల్‌ అలియాస్‌ నరేష్‌ (35) స్థానికంగా పాల వ్యాపారం చేస్తున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య జోయాబేగం సైదాబాద్‌ మోయిన్‌బాగ్‌లో నివాసం ఉంటోంది. అయితే.. అదే ప్రాంతంలో ఉండే సయ్యద్‌ ఫరీద్‌ అలీ అలియాస్‌ సోహైల్‌ (27) తో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసి భర్త.. షేక్‌ ఆదిల్‌ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఈ విషయాన్ని జోయా బేగం ప్రియుడు ఫరీద్‌ అలీకి చెప్పింది. ఎలాగైనా ఆదిల్‌ను చంపాలని ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు. ఈ మేరకు ఫరీద్‌ అలీ తన స్నేహితులు ముహమ్మద్‌ రియాజ్, షేక్‌ మావియా, మహ్మద్‌ జహీర్‌ల సహకారం తీసుకున్నాడు. అనుకున్న విధంగానే వారిని తీసుకోని ఈ నెల 19 న రాత్రి జోయాబేగం ఇంటికి చేరుకున్నారు.

ఈ సమయంలో ఆదిల్‌ ఇంట్లో నిద్రపోతుండగా.. నలుగురు కలిసి అతని మెడకు చున్నీతో ఉరి బిగించి, కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆటోలో పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మామిడిపల్లి రోడ్డుకు తరలించి.. పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యే ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు నిర్ధారించారు. ఐదుగురిని అరెస్టు శనివారం రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు.

Also Read:

Legal Notice to CP : హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌కు లీగల్ నోటీసులు జారీ.. ఎందుకోసమంటే..

Love Story: అచ్చం కన్యాదానం సినిమానే.. భార్య సంతోషంగా లేదని భర్త ఏం చేశాడో తెలుసా..?

Hyderabad: నీలోఫర్‌ ఆసుపత్రిలో దారుణం.. రూ.100 కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డ్‌బాయ్‌..