Legal Notice to CP : హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌కు లీగల్ నోటీసులు జారీ.. ఎందుకోసమంటే..

Legal Notice to CP Anjani Kumar: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. డ్రగ్స్ తనిఖీల సమయలో పోలీసులు ఫోన్ చాటింగ్‌లు పరిశీలించడంపై

Legal Notice to CP : హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌కు లీగల్ నోటీసులు జారీ.. ఎందుకోసమంటే..
Cp Anjani Kumar
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 31, 2021 | 12:46 PM

Legal Notice to CP Anjani Kumar: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. డ్రగ్స్ తనిఖీల సమయలో పోలీసులు ఫోన్ చాటింగ్‌లు పరిశీలించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐసీ ఎక్స్‌పర్ట్ కె. శ్రీనివాస్.. సీపీ అంజనీ కుమార్‌కు లీగల్ నోటీసులు పంపించారు. డ్రగ్స్ తనిఖీల సమయంలో పోలీసులు ఫోన్ చాటింగ్‌లు పరిశీలించడం సరికాదని, కారణం లేకుండా పోలీసులు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అని నోటీస్ లో పేర్కొన్నారు. కాగా, ఇటీవల వెస్ట్‌జోన్‌ ప్రాంతంలో డ్రగ్స్‌ సంబంధిత తనిఖీల సమయంలో స్మార్ట్‌ఫోన్లు చూపించాలంటూ పోలీసు అధికారులు స్థానిక ప్రజలను కోరినట్లు వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా కె.శ్రీనివాస్‌.. సీపీకి లీగల్ నోటీసులు పంపించారు. అక్టోబరు 27వ తేదీన హైదరాబాద్‌ పరిధిలోని మంగళ్‌హాట్‌, ధూల్‌పేట్‌, జుమేరాత్‌బజార్‌ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే, ఈ తనిఖీల సందర్భంగా పోలీసులు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారని, తక్షణమే వాటిని గుర్తించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సహేతుకమైన కారణాలు లేకుండా సాధారణ పౌరులను ఆపి.. మొబైల్ ఫోన్ మెసేజ్‌లు చూపించాలని కోరే అధికారం ఏ పోలీసు అధికారికీ లేదని నోటీసులో పేర్కొన్నారు.

కాగా, ఈ లీగల్ నోటీసులపై సీపీ అంజనీ కుమార్ స్పందించారు. వాహన తనిఖీలో సెల్ ఫోన్ పరిశీలించడం పై వివరణ ఇచ్చారు. అనుమానాస్పద వ్యక్తులపై అనుమానం ఉంటే స్పాట్ లోనే అన్ని ఆధారాలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తి ఐడెంటిటీ కొరకు ఆయన వద్ద ఉన్న ఐడి ప్రూఫ్స్ పరిశీలిస్తామని తెలిపారు. నార్త్ జోన్ పరిధిలో నిర్వహించిన తనిఖీలో ఓ క్రిమినల్.. కానిస్టేబుల్ ను కత్తి తో పొడిచాడని సీపీ తెలిపారు. ఆ నేపథ్యంలోనే అనుమానితులను అన్ని రకాలుగా పరిశీలించామని పేర్కొన్నారు. కాగా, వాహన తనిఖీల్లో పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నారని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.

Also read:

Boiled lemon water: నిమ్మకాయతో అలా చేయండి.. ఇలా రక్తపోటును తగ్గించుకోండి..

Badvel By Election: బద్వేల్‌లో పోలింగ్ శాతం పెరగడానికి కారణం అదే.. సంచలన కామెంట్స్ చేసిన బీజేపీ నేత..

Telangana Devudu: కేసీఆర్ బయోపిక్.. ‘తెలంగాణ దేవుడు’ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్ర యూనిట్..