Telangana Devudu: కేసీఆర్ బయోపిక్.. ‘తెలంగాణ దేవుడు’ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్ర యూనిట్..

Telangana Devudu: బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఈ వుడ్ ఆవుడ్ అని లేదు.. ప్రస్తుతం ఏ చలన చిత్ర పరిశ్రమలో చూసినా బయోపిక్ ల హవా నడుస్తోంది...

Telangana Devudu: కేసీఆర్ బయోపిక్.. 'తెలంగాణ దేవుడు' రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్ర యూనిట్..
Telangana Devudu
Follow us
Surya Kala

|

Updated on: Oct 31, 2021 | 12:25 PM

Telangana Devudu: బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఈ వుడ్ ఆవుడ్ అని లేదు.. ప్రస్తుతం ఏ చలన చిత్ర పరిశ్రమలో చూసినా బయోపిక్ ల హవా నడుస్తోంది. క్రీడాకారులు, రాజాకీయ ప్రముఖులు, ఉద్యమ నేతల జీవితాలను అందమైన దృశ్యకావ్యాలుగా తెరకెక్కిస్తున్నారు. వీటిల్లో ఎక్కువ సినిమాలు ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. ఇక తెలుగు లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సిమీ రాజశేఖర్ పై యాత్ర సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ వంతు వచ్చింది. ఆయన నిజ జీవితంలోని కథతో దేవుడుగా వెండి తెరపై అలరించనున్నారు. వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ జీవితాన్ని ఆధారంగా తెలుగు తెరపై సినిమాగా ఆవిష్కరించారు. దేవుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ ..ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కేసీఆర్ గా శ్రీకాంత్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్  పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీబిజీగా ఉంది. దీంతో చిత్ర యూనిట్ దేవుడు సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. నవంబర్ 12న విడుదల చేయనున్నామని  తెలిపింది.

శ్రీకాంత్ ప్రధాన పాత్రలో వడ‌త్యా హ‌రీశ్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న దేవుడు మూవీని వడత్యా జీష‌న్ ఉస్మానీ, మహ్మద్ జాకీర్ ఉస్మాన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేసీఆర్ జీవితంలో ఎదుర్కొన్న స‌మ‌స్యలు, ఉద్యమం, అధికారం చేప‌ట్టిన ప‌లు అంశాల‌ను ఆధారంగా చేసుకొని చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

శ్రీకాంత్ దేవుడు సినిమా పై మాట్లాడుతూ.. తాను సీఎం కేసీఆర్ గా నటించడం చాలా గర్వంగా ఉందని చెప్పారు. తెలంగాణలో తనకంటూ ఓ చరిత్ర లిఖించుకున్న ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని అన్నారు.

Also Read: Diwali 2021 Special: దీపావళి స్పెషల్.. ఇంట్లోనే టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీ..

సీనియర్ నటుడు కైకాలకు స్వల్ప అస్వస్థత.. చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిక