Hyderabad: నీలోఫర్‌ ఆసుపత్రిలో దారుణం.. రూ.100 కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డ్‌బాయ్‌..

Niloufer Hospital Hyderabad: ప్రాణాలు పోసే ఆస్పత్రుల్లో కొందరి కాసుల కక్కుర్తి.. అభంశుభం తెలియని వారిని పొట్టన బెట్టుకుంటోంది. వంద రూపాయల కక్కుర్తి.. ఓ చిన్నారిని బలి తీసుకుంది. కేవలం రూ.100కు

Hyderabad: నీలోఫర్‌ ఆసుపత్రిలో దారుణం.. రూ.100 కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డ్‌బాయ్‌..
Images
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 31, 2021 | 11:22 AM

Niloufer Hospital Hyderabad: ప్రాణాలు పోసే ఆస్పత్రుల్లో కొందరి కాసుల కక్కుర్తి.. అభంశుభం తెలియని వారిని పొట్టన బెట్టుకుంటోంది. వంద రూపాయల కక్కుర్తి.. ఓ చిన్నారిని బలి తీసుకుంది. కేవలం రూ.100కు ఆశపడి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నారికి ఇవ్వాల్సిన ఆక్సిజన్ పైపును వేరే వాళ్లకు అమర్చాడు ఓ వార్డుబాయ్. దీంతో ఆ బాలుడు ప్రాణవాయువు అందక ఉక్కిరిబిక్కిరి అయి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే కన్నుమూశాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో శనివారం చోటుచేసుకుంది. వంద రూపాయలకు కక్కుర్తిపడిన వార్డుబాయ్‌.. ఆ బాలుడికి అందించే.. ఆక్సిజన్‌ పైపును వేరేవారికి మార్చడంతో నాలుగేళ్ల బాలుడు కన్నుమూశాడు. ఎర్రగడ్డకు చెందిన మహ్మద్‌ ఆజం కుమారుడు మహ్మద్‌ ఖాజా(4) కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్నాడు. సమస్య తీవ్రం కావడంతో.. కుటుంబసభ్యులు మొదట ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ రెండు, మూడు రోజులకే రూ.2 లక్షల బిల్లు అయ్యింది. దీంతో ఖాజా తలిదండ్రులు మూడు రోజుల క్రితం నిలోఫర్‌లో చేర్పించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని చూసిన వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో శనివారం బాలుడికి స్కానింగ్‌ తీయించాల్సి ఉంది. అక్కడికి తీసుకెళ్లడానికి ఆక్సిజన్‌ సిలిండర్‌ను సమకూర్చాల్సి ఉంది. ఈ క్రమంలో రూ.100 అడిగితే ఇవ్వలేదని.. ఆసుపత్రిలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్న వార్డుబాయ్‌ సుభాష్‌… ఆ బాలుడికి పెట్టిన ఆక్సిజన్‌ పైపును తీసి పక్క పడకలో ఉన్న రోగికి అమర్చినట్లు నాంపల్లి ఠాణా ఇన్‌స్పెక్టర్‌ ఎం.డి.ఖలీల్‌పాషా తెలిపారు. వారి వద్ద రూ.100 తీసుకుని ఈ పనికి పాల్పడినట్లు వెల్లడించారు. దీంతో కొద్దిక్షణాల్లోనే బాలుడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు వచ్చేలోపే ఆ చిన్నారి తుదిశ్వాస విడిచాడు. ఆగ్రహించిన బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు బలైనట్లు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆందోళనకారులు ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేయడానికి యత్నించడంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న.. ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖాద్రి ఆసుపత్రికి వచ్చి పరిశీలించి, సిబ్బంది తీరు, వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డ్ బాయ్‌తో పాటు వైద్యులపై చర్యలు తీసుకుని బాలుడు కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే పాషా ఖాద్రీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన అనంతరం నిలోఫర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ వార్డుబాయ్‌ సుభాష్‌ను వెంటనే సస్పెండ్‌ చేశారు.

Also Read:

Liquor Depot Accident: మద్యం డిపోలో అగ్ని ప్రమాదం.. అధికారుల లెక్కల్లో భారీ తేడా.. అసలు కథేంటంటున్న జనాలు..!

Jammu and Kashmir: ఎల్ఓసీ వెంట పేలిన మందుపాతర.. ఇద్దరు జవాన్ల వీరమరణం..